AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖరీదైన సీరమ్స్ వద్దు.. ఈ సింపుట్ చిట్కాతో పైసా ఖర్చు లేకుండా హెయిర్‌ఫాల్‌కు చెక్‌ పెట్టొచ్చు!

ప్రతి ఒక్కరూ పొడవాటి, మందపాటి, పట్టులాంటి జుట్టు కావాలని కోరుకుంటారు. ఇందుకోసం జనాలు మార్కెట్‌లో దొరికే అనేక రకాల ఉత్పత్తులను వాడుతారు. కానీ దీని వల్ల కొన్ని సార్లు జుట్టు పెరగకపోవడంతో పాటు ఉన్న జుట్టు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ జుట్టు రాలుడు తగ్గాలన్నా, జుట్టు ఒత్తుగా పెరగాలన్నా మీ వంట గదిలో లభించే ఈ వస్తువు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మీ జుట్టుతో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతకూ ఏంటది అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి.

ఖరీదైన సీరమ్స్ వద్దు.. ఈ సింపుట్ చిట్కాతో పైసా ఖర్చు లేకుండా హెయిర్‌ఫాల్‌కు చెక్‌ పెట్టొచ్చు!
Hair Fall Control Tips
Anand T
|

Updated on: Feb 15, 2026 | 9:32 PM

Share

మారుతున్న లైఫ్‌స్టైల్, కాలుష్యం కారణంగా చర్మం, జుట్టు రెండూ త్వరగా దెబ్బతింటాయి. దీని వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో జనాల్లో ఆందోళన కూడా పెరిగిపోతుంది. ఈ క్రమంలో జుట్టు సంరక్షణపై శ్రద్ధ చూపడం ఎంతో ముఖ్యం. ఈ సందర్భంగా మీ జుట్టును రక్షించేందుకు మీ వంటింట్లో లభించే బియ్యం ఎంతగానో ఉపయోగపడుతాయి. అవునూ బియ్యం నీటిని జుట్టుకు అప్లై చేసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. బియ్యం కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంటాయి. బియ్యం నీటితో విటమిన్ బి, విటమిన్ ఇ, అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టును మూలాలను బలోపేతం చేస్తాయి.అలాగే ఇందులో ఉండే ఇనోసిటాల్ దెబ్బతిన్న జుట్టును మరమ్మతు చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఇంట్లో బియ్యం నీరు ఎలా తయారు చేసుకోవాలి?

ఈ బియ్యం నీటిని మీరు ఇంట్లోనే ఈజీగా తరాయు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా, అర కప్పు ముడి బియ్యాన్ని తీసుకుని బాగా కడగాలి. ఇప్పుడు దానికి 2-3 కప్పుల నీళ్లు పోసి 30 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టి ఒక బాటిల్‌లోకి తీసుకోవాలి. దానికి మూతపెట్టి గది ఉష్ణోగ్రత వద్ద 24 గంటలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత బియ్యం నీళ్ళు కొద్దిగా పుల్లగా వాసన రావడం ప్రారంభిస్తాయి. అంటే మీకు కవాల్సిన బియ్యం నీరు రెడీ అయినట్టే.

జుట్టు మీద ఎలా ఉపయోగించాలి?

మీరు షాంపూ అప్లై చేసి తల స్నానం చేసిన రోజూ.. స్నానం చేసిన కొద్ది సేపటికి మీరు రెండీ చేసుకున్న బియ్యం నీటిని మీ తలపై స్ప్రే చేయండి. తర్వాత 5 నుండి 10 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకోండి. 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై శుభ్రమైన నీటితో కడిగేయండి. ఇలా వారానికి 1 నుండి 2 సార్లు చేయడం వల్ల మీ జుట్టులో త్వరగా తేడా కనిపిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు జుట్టు మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

బియ్యం నీటి వల్ల ఉపయోగాలు

బియ్యం నీరు తలకు పోషణనిచ్చి జుట్టును బలపరుస్తుంది. అలాగే జుట్టు వేగంగా పెరిగేందుకు సహాయపడుతుంది. అంతేకాదు జుట్టుకు సహజ మెరుపును ఇస్తుంది. గజిబిజిగా ఉన్న మీ జుట్టును మృదువుగా మారుతస్తుంది. బియ్యం నీళ్లను మీ తలకు అప్లై చేసినప్పుడు మీ తలతో ఉన్న చుండ్రును కూడా ఇది తొలగిస్తుంది. అయితే మీరు బియ్యం నీటిని ఎక్కువగా ఉపయోగిస్తే, అది మీ జుట్టును పొడిబారేలా చేస్తుంది. కాబట్టి, వారానికి రెండుసార్లు మాత్రమే ఉపయోగించడం మంచిది. మీ తలకు ఏదైనా అప్లై చేసే ముందు, ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, ఎందుకంటే ప్రతిదీ ప్రతి చర్మ రకానికి సరిపోదు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us