Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మండలి రద్దు సరే.. మరి ఆ ఇద్దరు మంత్రుల సంగతేంటి?

అందరు అనుకున్నట్లుగానే ఏపీలో శాసనమండలి రద్దుకే జగన్ ప్రభుత్వం మొగ్గు చూపింది. సోమవారం ఉదయాన్ని సమావేశమైన ఏపీ కేబినెట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దుకు తీర్మానం చేసింది. ఆ తర్వాత అసెంబ్లీలో సదరు తీర్మానాన్ని ప్రతిపాదించింది. ప్రతిపక్షమే లేని అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందడం లాంఛనమే అయ్యింది. ఈ క్రమంలో వెనువెంటనే ఉత్పన్నమైన ప్రశ్న.. మరి మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించిన కేబినెట్‌లో అదే మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల మాటేంటి? టీడీపీ […]

మండలి రద్దు సరే.. మరి ఆ ఇద్దరు మంత్రుల సంగతేంటి?
Follow us
Rajesh Sharma

|

Updated on: Jan 27, 2020 | 4:22 PM

అందరు అనుకున్నట్లుగానే ఏపీలో శాసనమండలి రద్దుకే జగన్ ప్రభుత్వం మొగ్గు చూపింది. సోమవారం ఉదయాన్ని సమావేశమైన ఏపీ కేబినెట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దుకు తీర్మానం చేసింది. ఆ తర్వాత అసెంబ్లీలో సదరు తీర్మానాన్ని ప్రతిపాదించింది. ప్రతిపక్షమే లేని అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందడం లాంఛనమే అయ్యింది. ఈ క్రమంలో వెనువెంటనే ఉత్పన్నమైన ప్రశ్న.. మరి మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించిన కేబినెట్‌లో అదే మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల మాటేంటి?

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అయితే.. వారిద్దరు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కానీ టెక్నికల్‌గా చూస్తే వారిద్దరు తక్షణం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మండలి ఇంకా పూర్తిగా రద్దు కాలేదు. అందుకు ఎంతకాలం పడుతుందన్నది ఎవరు వెంటనే సమాధానం చెప్పలేని ప్రశ్న. ఎందుకంటే మండలి రద్దుపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ఎవరూ ఊహించలేరు.

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకోవడంతోపాటు.. మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్‌ని ఉపముఖ్యమంత్రిగాను, మోపిదేవి వెంకటరమణ మంత్రిగాను తీసుకున్నారు. వీరిలో సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ పదవీ కాలం 2021 వరకు వుండగా.. మోపిదేవి పదవీ కాలం 2023 వరకు వుంది. తాజాగా మండలిని రద్దు చేయాలని నిర్ణయించిన దరిమిలా మండలి రద్దు ప్రహసనం పూర్తి అయితే.. ఆ తర్వాత వీరిద్దరు రాజీనామా చేయాల్సి వుంటుందా ? ఆ తర్వాత కూడా ఆరునెలల పాటు వీరిద్దరు మంత్రి పదవుల్లో కొనసాగవచ్చా ?

సాంకేతికంగా అయితే.. ఏ పదవి లేకపోయినా ఆరునెలల పాటు మంత్రి పదవిలో కొనసాగవచ్చు. ఆ ఆరునెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైతే సరిపోతుంది. కానీ వీరిద్దరి విషయంలో తమ సీటును త్యాగం చేసేందుకు ఎవరు ముందుకొస్తారన్నది పెద్ద ప్రశ్న. అధినేత కోసమైతే ఎవరో ఒకరు భవిష్యత్తు దృష్ట్యా తమ సీటును వదులుకుంటారు. కానీ వీరిద్దరి విషయంలో ఎమ్మెల్యే సీటును ఎవరూ త్యాగం చేయకపోవచ్చు.

కేబినెట్ నుంచి రాజ్యసభకు..

తాజాగా వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ నిజమే అయితే.. సుభాష్ చంద్రబోస్‌ని, వెంకట రమణని రాజ్యసభకు పంపుతానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. మార్చి నెలలో రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో నలుగురు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో వారి స్థానంలో వీరిద్దరిని రాజ్యసభకు పంపేందుకు జగన్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు మంత్రులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారిని తొలగిస్తే.. విపక్షాలకు కుల అస్త్రాన్ని ఇచ్చినట్లవుతుందని సీఎం భావిస్తున్నారని అంటున్నారు. మోపిదేవి మత్స్యకారుల కుటుంబానికి చెందిన వారు కాగా.. సుభాష్ చంద్రబోస్ ఏపీ వ్యాప్తంగా బలమైన ఓట్ల సంఖ్య కలిగిన శెట్టిబలిజ వర్గానికి చెందిన వారు.

కుల సమీకరణలతో పాటు వీరిద్దరు ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత లాయలిస్టులుగా పేరుంది. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగరేసి.. జగన్ బయటికి వచ్చేసిన సందర్భంలో ఆయన వెంట తొట్టతొలిగా నడిచిన వారిలో సుభాష్ చంద్రబోస్ ఒకరు. మోపిదేవి ప్రత్యేక కారణాల వల్ల జగన్‌కు అత్యంత సన్నిహితునిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మంత్రి పదవులను కేవలం నిబద్ధత అనే అంశం ఆధారంగా తొలగించి, వారిద్దరి రాజ్యసభకు పంపుతారని తాజాగా జరుగుతున్న ప్రచారం.