ఎయిరిండియా సేల్.. మోదీ ప్రభుత్వంపై సుబ్రమణ్యస్వామి ఫైర్
అప్పుల భారంలో కూరుకుపోయిన ఎయిరిండియాలో 100 శాతం వాటాను విక్రయానికి పెడతామంటూ మోదీ ప్రభుత్వం సోమవారం చేసిన ప్రకటనపై సాక్షాత్తూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మండిపడ్డారు. ఇది జాతి వ్యతిరేకమని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డీల్ పై మోదీ ప్రభుత్వాన్ని కోర్టుకు లాగుతానని ట్వీట్ చేశారు. ‘మన కుటుంబ ఆభరణాన్ని ఎలా అమ్ముతాం’ అని ప్రశ్నించారు. ఎయిరిండియా నష్టాలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఈ సంస్థను ఆదుకోకుండా ఎందుకు విక్రయిస్తున్నారని కూడా ఆయన సూటిగా పేర్కొన్నారు. […]

అప్పుల భారంలో కూరుకుపోయిన ఎయిరిండియాలో 100 శాతం వాటాను విక్రయానికి పెడతామంటూ మోదీ ప్రభుత్వం సోమవారం చేసిన ప్రకటనపై సాక్షాత్తూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మండిపడ్డారు. ఇది జాతి వ్యతిరేకమని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డీల్ పై మోదీ ప్రభుత్వాన్ని కోర్టుకు లాగుతానని ట్వీట్ చేశారు. ‘మన కుటుంబ ఆభరణాన్ని ఎలా అమ్ముతాం’ అని ప్రశ్నించారు. ఎయిరిండియా నష్టాలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఈ సంస్థను ఆదుకోకుండా ఎందుకు విక్రయిస్తున్నారని కూడా ఆయన సూటిగా పేర్కొన్నారు. అటు-ఎయిరిండియా డిజిన్విస్ట్ మెంట్ పై సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కూడా తీవ్రంగా విమర్శించారు.’ ప్రభుత్వాల వద్ద నిధులు లేనప్పుడు ఇలాంటి పనులకే ఒడిగడతాయని అన్నారు.’ ఆర్ధిక వృద్ది 5 శాతానికి దిగజారింది.. జాతీయ ఉపాధి హామీ పథకం కింద కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి.. ఈ విధమైన పరిస్థితుల్లో మన దగ్గరున్న అమూల్యమైన ఆస్తులన్నీ ప్రభుత్వాలు అమ్మేస్తాయి’ అని ఆయన దుయ్యబట్టారు.
Air India disinvestment process restarts today https://t.co/72eklh9C3g: THIS DEAL IS WHOLLY ANTI NATIONAL and IWILL FORCED TO GO TO COURT. WE CANNOT SELL OUR FAMILY SILVER
— Subramanian Swamy (@Swamy39) January 27, 2020
ఎయిరిండియా విక్రయానికి సంబంధించి ప్రభుత్వం ప్రిలిమినరీ బిడ్లను ఆహ్వానించింది. ఆసక్తి గల బిడ్డర్లు మార్చి 17 లోగా తమ సంసిధ్ధతను తెలపాలని కోరింది. క్వాలిఫై అయిన బిడ్డర్లను మార్చి 31 న నోటిఫై చేస్తామని పేర్కొంది. అయితే ఈ స్ట్రాటిజిక్ డిజిన్విస్ట్ మెంట్ కు సంబంధించిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మెమోరాండం మాత్రం ఈ తేదీలు మార్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. రెండేళ్లలో ఎయిరిండియాను ఇలా వంద శాతం అమ్మకానికి పెడతామని ప్రభుత్వం ప్రకటించడం ఇది రెండో సారి. నష్టాల్లో ఉన్న సంస్థను తిరిగి లాభాల బాటలోకి తెచ్చేబదులు..దాన్ని ఏకంగా అమ్మేస్తారా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.