ఖమ్మం గ్యాంగ్ రేప్ కేసు: ఏడుగురు నిందితుల అరెస్ట్..
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఈ శుక్రవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహితపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఒకరు అదే రోజు స్పాట్‌లో అదుపులోకి తీసుకోగా, మిగిలిన ఆరుగురుని ఆదివారం పట్టుకున్నారు. ఏం జరిగిందంటే : రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న మహిళలపై విరుచుకుపడ్డారు కామాంధులు. ఇంట్లోకి ప్రవేశించి, […]

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఈ శుక్రవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహితపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఒకరు అదే రోజు స్పాట్‌లో అదుపులోకి తీసుకోగా, మిగిలిన ఆరుగురుని ఆదివారం పట్టుకున్నారు.
ఏం జరిగిందంటే :
రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న మహిళలపై విరుచుకుపడ్డారు కామాంధులు. ఇంట్లోకి ప్రవేశించి, అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి..కాళ్లు, చేతులు కట్టేశారు. ఆపై బైక్‌పై హర్యాతండాలోని పత్తి చేనులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెను బలవంతంగా తీసుకువెళ్లడాన్ని గమనించిన పక్కింటి యువకుడు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెళ్లేసరికి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు.. అక్కడినుంచి పరారయ్యారు. బాధితురాలును ఆస్పత్రికి తరలించిన పోలీసులు..ఆమె వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు హర్యాతండాకు చెందిన బాణోతు ఉపేందర్, బాణోతు మోహన్, బాణోతు చంటి, అంగోతు కల్యాణ్, అజ్మీరా నాగేశ్వరరావు.. సుకినీ తండాకు చెందిన మాలోతు అశోక్, బి. సునీల్‌లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరందర్నీ రహస్యంగా విచారిస్తున్నారు.