AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా..? కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకని ఆరోగ్యం!

మన పూర్వీకులు భోజనం తర్వాత లేదా ఉదయాన్నే చిన్న బెల్లం ముక్కను తినమని సలహా ఇచ్చేవారు. ఆయుర్వేదం ప్రకారం బెల్లం కేవలం ఒక తీపి పదార్థం మాత్రమే కాదు, అనేక రోగాలను నయం చేసే ఒక అద్భుతమైన ఔషధం. ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలో కలిగే మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా..? కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకని ఆరోగ్యం!
Morning Jaggery Benefits
Jyothi Gadda
|

Updated on: Jul 01, 2026 | 6:55 AM

Share

ఆయుర్వేదంలో బెల్లానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. దీనిని ప్రతి ఉదయం తీసుకుంటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం పరగడుపున బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. మరిన్ని లాభాలేంటో ఇప్పుడు చూద్దాం..

జీర్ణక్రియ మెరుగుపడుతుంది:

ఉదయాన్నే పరగడుపున బెల్లం తినడం వల్ల శరీరంలోని జీర్ణ ఎంజైములు యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణక్రియ సమస్యలు త్వరగా నయమవుతాయి. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

బెల్లంలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీ) బలోపేతం చేస్తాయి. తరచూ వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుండి ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం:

వయసు పైబడిన వారిలో లేదా ఈ కాలంలో యువతలో కూడా కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతిరోజూ ఉదయం చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. కీళ్ల నొప్పుల తీవ్రత క్రమంగా తగ్గుతుంది.

మహిళలకు ఎంతో మేలు:

మహిళలు తమ పీరియడ్స్ (నెలసరి) సమయంలో తీవ్రమైన పొత్తికడుపు నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి సమయంలో ప్రతిరోజూ ఉదయం బెల్లం తీసుకోవడం వల్ల పీరియడ్స్ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరానికి అవసరమైన రక్తం (ఐరన్) అందుతుంది.

బరువు నియంత్రణ, చర్మ సౌందర్యం:

పంచదారకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం వల్ల బరువు పెరగకుండా నియంత్రించవచ్చు. ఇది శరీరంలోని మెటబాలిజంను పెంచి కొవ్వును కరిగిస్తుంది. అలాగే, ముఖంపై వచ్చే ముడతలు, నల్లటి మచ్చలను నివారించి, చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే బెల్లం టీ తాగడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us