AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మంది స్కూల్‌ విద్యార్థులకు అస్వస్థత..! ఈజీ క్లీనింగ్‌ టిప్స్‌ మీ కోసమే

ఇళ్లలో నిత్యం వంట వండుకోవడానికి, తాగడానికి, ఇతర అవసరాలకు మనం వాటర్ ట్యాంకుల్లో నిల్వ ఉంచే నీటినే వాడుతుంటాం. అయితే, ఈ ట్యాంకులను శుభ్రం చేయడంలో మనం చూపే చిన్న నిర్లక్ష్యం ఒక్కోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. ఇటీవల ఒక పాఠశాలలో ప్లాస్టిక్ ట్యాంక్ నీటిని తాగడం వల్ల దాదాపు 100 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ట్యాంకుల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల నాచు (Algae), హానికరమైన బ్యాక్టీరియా, క్రిమికీటకాలు చేరే ప్రమాదం ఉంది. అందుకే, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంట్లోని వాటర్ ట్యాంకును ఎలా సులభంగా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మంది స్కూల్‌ విద్యార్థులకు అస్వస్థత..! ఈజీ క్లీనింగ్‌ టిప్స్‌ మీ కోసమే
How To Clean Water Tank
Jyothi Gadda
|

Updated on: Jun 30, 2026 | 1:06 PM

Share

వాటర్ ట్యాంకులను క్రమబద్ధంగా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా, నాచు చేరి నీరు విషపూరితంగా మారుతుందని చెప్పడానికి ఇటీవల జరిగిన ఒక పాఠశాల ఘటనే నిదర్శనం. అవును, జార్ఖండ్‌లో ప్లాస్టిక్ ట్యాంకులలో నిల్వ ఉంచిన నీటిని తాగిన తర్వాత సుమారు 100 మంది పాఠశాల విద్యార్థినులు కడుపునొప్పి, వాంతులు, తలతిరగడం వంటి సమస్యలతో అస్వస్థతకు గురయ్యారు.. అసలు కారణం తెలుసుకోవడానికి అధికారులు నీరు, ఆహార నమూనాలను పరీక్షల కోసం పంపారు.

అయితే, సరిగ్గా నిర్వహించకపోతే శుభ్రమైన నీరు కూడా సులభంగా కలుషితం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఇళ్ల నుండి నేరుగా తీసుకునే నీటి కంటే, ఇళ్లలో నిల్వ ఉంచిన తాగునీటిలో సూక్ష్మజీవుల కాలుష్యం ఉండే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. నీటిని సురక్షితంగా నిల్వ చేయడం, ట్యాంకును శుభ్రపరచడం, దానిని సరిగ్గా నిర్వహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు తెలిపారు. దీనికోసం ఏం చేయాలంటే..

క్రమబద్ధమైన సమయపాలన (Regular Schedule): నీటి ట్యాంకును సంవత్సరానికి ఒకసారి కాకుండా, కనీసం ప్రతి 2 నుండి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ట్యాంకులో పేరుకుపోయే పూడిక, మట్టి కణాలను తొలగించడానికి ఇది చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

ట్యాంక్‌ను ఖాళీ చేసి రుద్దడం: శుభ్రం చేసే ముందు ట్యాంక్‌లోని నీటిని పూర్తిగా ఖాళీ చేయాలి. ఆ తర్వాత లాంగ్-హ్యాండిల్ ఉన్న గరుకు బ్రష్ లేదా వైర్ బ్రష్ సహాయంతో ట్యాంక్ లోపలి గోడలు, అడుగు భాగాన్ని బాగా రుద్దాలి. దీనివల్ల గోడలకు పట్టిన జిగురు, నాచు సులభంగా ఊడిపోతాయి. రసాయన డిటర్జెంట్లు వాడితే వాటిని కడగడానికి ఎక్కువ నీరు పడుతుంది. కాబట్టి సాధారణ క్లీనింగ్ లిక్విడ్ లేదా బేకింగ్ సోడా వాడటం సురక్షితం.

క్రిమిసంహారక ప్రక్రియ (Disinfection): కేవలం మట్టిని వదిలిస్తే సరిపోదు, లోపల ఉండే కంటికి కనపడని బ్యాక్టీరియాను చంపడానికి బ్లీచింగ్ పౌడర్ (Bleaching Powder) లేదా క్లోరిన్ లిక్విడ్‌ను ఉపయోగించాలి. తగిన పరిమాణంలో బ్లీచింగ్ పౌడర్‌ను నీటిలో కలిపి, ఆ మిశ్రమాన్ని ట్యాంక్ గోడలకు పూసి ఒక గంట పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత ట్యాంక్‌ను అధిక పీడనం (High pressure) ఉన్న నీటితో పూర్తిగా కడిగేయాలి.

ఎయిర్-టైట్ మూత (Proper Lid): చాలా ఇళ్లలో ట్యాంక్ మూతలు సరిగ్గా ఉండవు లేదా విరిగిపోయి ఉంటాయి. దీనివల్ల కాకులు, పక్షుల వ్యర్థాలు, ఎలుకలు లేదా కీటకాలు నీటిలో పడి మురిగిపోతాయి. అందుకే ట్యాంక్‌కు ఎల్లప్పుడూ గట్టిగా బిగుసుకునే ఎయిర్-టైట్ మూతను అమర్చాలి.

వాటర్ ఫిల్టర్లు, పైప్‌లైన్స్: ట్యాంక్‌తో పాటు ఇళ్లకు నీటిని సరఫరా చేసే పైప్‌లైన్లను కూడా అప్పుడప్పుడు తనిఖీ చేయాలి. వీలైతే ట్యాంక్ ఇన్‌లెట్ (Inlet) వద్ద ఒక మెష్ ఫిల్టర్‌ను అమర్చడం ద్వారా లోపలికి మట్టి రాకుండా ముందే అడ్డుకోవచ్చు. కలుషిత నీరు టైఫాయిడ్, కలరా, విరేచనాలు వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి, మన కుటుంబ సంరక్షణ కోసం వాటర్ ట్యాంక్ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us