రాహుల్..చెల్లిపై ఏంటి ఆ కంప్లైంట్స్‌?..ప్రియాంక, రాహుల్ సరదా సంభాషణ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ.. ప్రియాంక గాంధీ శనివారం అనుకోకుండా ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న అన్నాచెల్లెళ్లు వేర్వేరు ప్రాంతాలకు వెళ్తూ కాన్పూర్ ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది.  ప్రియాంకని ఆట పట్టిస్తూ రాహుల్  ఫిర్యాదు చేశారు. పెద్దపెద్ద దూరాలకు తాను చిన్నచిన్న హెలికాప్టర్లలో తిరుగుతుంటే .. ప్రియాంక మాత్రం చిన్నచిన్న దూరాలకు పెద్దపెద్ద హెలికాప్టర్లలో వెళ్తొందంటూ […]

రాహుల్..చెల్లిపై ఏంటి ఆ కంప్లైంట్స్‌?..ప్రియాంక, రాహుల్ సరదా సంభాషణ
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 27, 2019 | 6:41 PM

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ.. ప్రియాంక గాంధీ శనివారం అనుకోకుండా ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న అన్నాచెల్లెళ్లు వేర్వేరు ప్రాంతాలకు వెళ్తూ కాన్పూర్ ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది.  ప్రియాంకని ఆట పట్టిస్తూ రాహుల్  ఫిర్యాదు చేశారు. పెద్దపెద్ద దూరాలకు తాను చిన్నచిన్న హెలికాప్టర్లలో తిరుగుతుంటే .. ప్రియాంక మాత్రం చిన్నచిన్న దూరాలకు పెద్దపెద్ద హెలికాప్టర్లలో వెళ్తొందంటూ నవ్వుతూ అన్నారు. ఈ సమయంలో ఇద్దరు భుజాలపై చేతులు వేసుకుని మరీ మాట్లాడుకున్నారు. అన్న మాట్లాడుతుంటే ప్రియాంక ఉద్వేగానికి గురయ్యారు. అలాగే నవ్వుతూ ఉండిపోయారు. చివర్లో  ప్రియాంక  అది నిజం కాదని అన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పైలెట్లకు పోటోలు ఇచ్చి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. యూపీ ఎన్నికల ప్రచారంలో అటు రాహుల్, ఇటు ప్రియాంక బిజీగా ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రియాంక గాంధీ రాజకీయ తెరంగ్రేట్రం చేసిన సంగతి తెలిసిందే.