‘నా గుండెకు తగిలిన దెబ్బకు’.. ఎమోషన్స్ పండిన వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్…

WFL Trailer: రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరిన్, ఇసాబెల్లా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమాకు క్రాంతి మాధవ్ దర్శకుడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా.. ఈ మూవీలో విజయ్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించన్నట్లు తెలుస్తోంది. లవ్ అండ్ ఎమోషనల్ రైడ్‌గా ఈ ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. విజయ్, నలుగురు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీస్‌.? వారి మధ్య ఎమోషన్స్.. వారు […]

'నా గుండెకు తగిలిన దెబ్బకు'.. ఎమోషన్స్ పండిన వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్...


WFL Trailer: రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరిన్, ఇసాబెల్లా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమాకు క్రాంతి మాధవ్ దర్శకుడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా.. ఈ మూవీలో విజయ్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించన్నట్లు తెలుస్తోంది. లవ్ అండ్ ఎమోషనల్ రైడ్‌గా ఈ ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది.

విజయ్, నలుగురు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీస్‌.? వారి మధ్య ఎమోషన్స్.. వారు వదిలి వెళ్ళిపోయిన తర్వాత విజయ్ అనుభవించిన పెయిన్.? లాంటి విషయాలన్నీ కూడా ట్రైలర్‌లో ఎలివేట్ చేసింది. మొత్తానికి ఈ సినిమా టీజర్ సోసోగా ఉన్నా.. విడుదలైన ట్రైలర్ మాత్రం చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది. లాస్ట్‌లో ‘నా గుండెకు తగిలిన దెబ్బకు.. ఆ బాధ తెలియకుండా ఉండాలంటే.. ఫిజికల్‌గా ఈ మాత్రం పెయిన్ ఉండాలని విజయ్ చెప్పే డైలాగు అద్భుతంగా ఉంది.

‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి క్లాసిక్ సినిమాను తెరకెక్కించిన క్రాంతి మాధవ్.. విజయ్ దేవరకొండను ఏవిధంగా చూపించబోతున్నాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇకపోతే చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ పాత్రలు కీలకమైనవని తెలుస్తోంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. కాగా, వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Published On - 4:49 pm, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu