AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Godavari Tradition: అక్కడ భక్తితో మొక్కలు నాటితే సంతానం కలుగుతుందట..!

West Godavari Tradition: గ్రీన్ ఛాలెంజ్‌..సొషల్ కాజ్‌ కోసం సెలబ్రీటీలు ఓ మొక్కనాటి మరో ముగ్గురిని మొక్కలు నాటమంటూ ఛాలెంజ్‌ చేస్తారు. దీని వల్ల పచ్చదనం పెరుగుతోంది. అయితే పశ్చిమగోదావరి జిల్లా అనాదిగా ఓ ఆచారం నడుస్తుంది. అయితే అది పచ్చదనం కోసం కాదు. పిల్లల కోసం. సంతానం కావాలనుకుంటున్న దంపతులు శివరాత్రి రోజు కొబ్బరిమొక్కో, పూల మొక్కో నాటితే పుత్ర ప్రాప్తి కలుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రతి ఏటా ద్వాదశ జ్యోతిర్లింగాలకు జనం ఎలా […]

West Godavari Tradition: అక్కడ భక్తితో మొక్కలు నాటితే సంతానం కలుగుతుందట..!
Ram Naramaneni
|

Updated on: Feb 16, 2020 | 5:38 PM

Share

West Godavari Tradition: గ్రీన్ ఛాలెంజ్‌..సొషల్ కాజ్‌ కోసం సెలబ్రీటీలు ఓ మొక్కనాటి మరో ముగ్గురిని మొక్కలు నాటమంటూ ఛాలెంజ్‌ చేస్తారు. దీని వల్ల పచ్చదనం పెరుగుతోంది. అయితే పశ్చిమగోదావరి జిల్లా అనాదిగా ఓ ఆచారం నడుస్తుంది. అయితే అది పచ్చదనం కోసం కాదు. పిల్లల కోసం. సంతానం కావాలనుకుంటున్న దంపతులు శివరాత్రి రోజు కొబ్బరిమొక్కో, పూల మొక్కో నాటితే పుత్ర ప్రాప్తి కలుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రతి ఏటా ద్వాదశ జ్యోతిర్లింగాలకు జనం ఎలా పోటెత్తుతుంటారో.. అలా ఈ శివాలయానికి అదే తరహాలో కిటకిటలాడుతుంటారు. మళ్లీ శివరాత్రి వచ్చేసింది.. ఈ ఏడాది వచ్చే దంపతుల కోసం మొక్కలతో ఆ గ్రామం సిద్ధంగా ఉంది.

ఒక్కో జిల్లాలో ఒక్కో ఆచారం.. ఒక వింత నమ్మకం ప్రచారంలో ఉంటుంది. అనాదిగా వస్తున్న ఆచారం సాంప్రదాయంగా పాటిస్తుంటారు. పశ్చిమగోదావరి జిల్లాలోని గుంటుపల్లి గుహలుగా పిలవబడే బౌద్ధక్షేత్రంలో కార్తీకమాసం మూడో సోమవారం శివుని విగ్రహం ముందు మహిళలు పూలు, పళ్లలతో నిద్రపోతారు. కలలో పిల్లలు ఆడుకునే వస్తువులు కనిపిస్తే వారికి సంతాన భాగ్యం కలుగుతుందనేది అక్కడి నమ్మకం. ఇక ఇలాంటి నమ్మకమే ఇదే జిల్లాలోని శివదేవుని చిక్కాలలో ఉంది. సంతానం లేనివారు, నూతన దంపతులు ప్రతి యేట పెద్ద సంఖ్యలో తరిలివస్తారు.

ఈ శివదేవుని చిక్కాలకు ఒక విశిష్టత ఉందని స్ధలపురాణం చెబుతుంది. నారికేళం త్రిమూర్తులకు సంకేతంగా భావిస్తున్నందున్న , కొబ్బరిమొక్కను పూజించి భక్తితో ఆ మొక్కను నాటితే సంతానం కలుగటమనేది ఇక్కడి ఆలయ విశిష్టతగా అర్చకులు చెబుతున్నారు. ప్రతియేటా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండంతో వారి కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ తమ వెంట తెచ్చుకున్న మొక్కలకు గర్భగుడిలో ముందు పూజలు చేస్తారు. అది సాధ్యం కాకపోవటంతో స్థానికంగా ఉన్న సత్యానారాయణ స్వామి ఆలయంలో సామూహిక అభిషేకాలు చేస్తున్నారు. వీటికోసం పెద్ద ఎత్తున్న చలువ పందిళ్లు సిద్ధం చేశారు. అభిషేకం తర్వాత భక్తులు మొక్కలతో దేవుడిని దర్శించుకుని ఆలయంలో నాటుతారు.

ఆచార, సాంప్రదాయాలను సైన్స్‌తో ముడిపెట్టి హేతుబద్ధంగా ఆలోచించిస్తున్నారు కొందరు. ఆపరేషన్ చేయించుకున్న దంపతులను పంపుతాం పిల్లలు పుడతారా అని సవాల్ విసురుతున్నారు. సవాళ్లు, ప్రతిసవాళ్ల మాట ఎలా ఉన్న.. ఇక్కడ ఆలయానికి వచ్చే భక్తులు మాత్రం నమ్మకమనే పునాది ఆధారంగా ఈ తంతు జరిగిపోతుంది.

ఇది కూడా చదవండి : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..

Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?