Breaking News
  • రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. గడచిన 24 గంటల్లోనే 438 మంది వైరస్‌ బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులకు పది ప్రాంతాలు డేంజర్‌ స్పాట్స్‌గా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది.
  • అసలే జనం భయంతో బతికేస్తున్నారు. ఈ టైమ్‌లో కరోనాపై అవాకులు చవాకులు పేల్చేవాళ్లు ఎక్కువయ్యారు. కొందరు ఫేక్‌ న్యూస్‌ పోస్టు చేస్తుంటే కొందరు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై, వైద్యులపై ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మొత్తం రాష్ట్ర పరిస్థితిని ఆరా తీస్తున్నారు.
  • ఏలూరులో ఒక్కసారిగా ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు తెరమీదకు వచ్చాయి. ఇంకెన్ని ఉంటాయోనని ప్రజలు భయపడుతుంటే అలాంటి హై రిస్క్‌ జోన్‌లో నిరంతరం పని చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం సిటీలో 144 సెక్షన్‌ అమలవుతోంది. కుటుంబాలకు దూరంగా రెడ్‌జోన్‌లో పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.
  • ప్రతీది కరోనా కాదు.. పొడిదగ్గు తుమ్ములు ఉంటే వాయుకాలుష్యం. దగ్గు, తెమడ, ముక్కు కారడం, తుమ్ములు వస్తే జలుబు. దగ్గు, తెమడ, తుమ్ములు, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, బలహీనత, తేలికపాటి జ్వరం ఫ్లూ లక్షణాలు. పొడిదగ్గు, తుమ్ములు, ఒంటి నొప్పులు, అధిక జ్వరం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇవన్నీ కొవిడ్‌-19 లక్షణాలు. ప్రతీది కరోనా కాదు.. కంగారు పడొద్దు..
  • నిజాముద్దీన్ మర్కజ్ కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ నోటీసులు. తబ్లీఘీ-జమాత్ చీఫ్ మౌలానా సాద్ సహా 7గురు నిందితులకు నోటీసులు. నిబంధనలు ఎందుకు అతిక్రమించారో రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం. నిందితుల ఇళ్లకు నోటీసులు పంపించిన క్రైం బ్రాంచ్.

Good News To Farmers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..

Good News To Farmers Government closely monitoring agriculture credit given by banks: Finance Minister, Good News To Farmers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..

Good News To Farmers : కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది నుంచి రైతులకు దేశ వ్యాప్తంగా ఇచ్చే రుణాల పరిమితి పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 7 శాతం వడ్డీ చెల్లిస్తూ గరిష్ఠంగా మూడు లక్షల వరకు..షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె..రైతుల ఆదాయాన్ని 2022కు రెట్టింపు చేసే దిశగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు పేర్కొన్నారు.

ఈ ప్రక్రియలో భాగంగానే కేవలం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాల అమలు కోసం రూ. 1.6 లక్షల కోట్లు కేటాయింపులు జరిపినట్టు తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వినతుల కారణంగా అన్నదాతల రుణ పరిమితిని పెంచినట్లు తెలిపిన ఆమె..గ్రామీణ ప్రాంతాలలో రైతులకు అందే రుణాలన్నింటిని కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఒక్క  పీఎం కిసాన్‌ పథకానికి రూ.75వేల కోట్లు కేటాయించామని..రైతులు ఆనందమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లోన్స్ టార్గెట్ రూ. 13.5 లక్షలు కోట్లు ఉందని పేర్కొన్నారు. 2021 లోగా దీన్ని రూ. 15 లక్షల కోట్లకి చేర్చడానికి ప్రయత్నిస్తామన్నారు. మూములుగా ప్రతి ఏడాది రుణ లక్ష్యాన్ని 9 శాతం మాత్రమే పెంచుతారని, కానీ ఎన్డీఏ ప్రభత్వం మాత్రం 11 శాతం పెంచినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు.

 

Related Tags