బహుబలి రూపం..గుట్టు విప్పితే గుప్పుమంది..!

గంజాయి స్మగ్లర్లు తెలివిమీరారు. బయటకు తెలియకుండా.. సరుకు దాటించేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లు రోజుకో కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. తాజాగా వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు సరికొత్త తరహా స్మగ్లింగ్‌కు పాల్పడ్డారు. పథకం బెడిసి కొట్టి చివరకు పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే..ఒంటిపై దుప్పటితో అనుమానాస్పదంగా రైల్వే ప్లాట్‌ఫాంపై తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న వరంగల్‌ పోలీసులు అవాక్కయ్యారు. బాహుబలిని తలపించే రీతిలో కనిపించిన అతని శరీర […]

బహుబలి రూపం..గుట్టు విప్పితే గుప్పుమంది..!
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 18, 2019 | 1:31 PM

గంజాయి స్మగ్లర్లు తెలివిమీరారు. బయటకు తెలియకుండా.. సరుకు దాటించేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లు రోజుకో కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. తాజాగా వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు సరికొత్త తరహా స్మగ్లింగ్‌కు పాల్పడ్డారు. పథకం బెడిసి కొట్టి చివరకు పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే..ఒంటిపై దుప్పటితో అనుమానాస్పదంగా రైల్వే ప్లాట్‌ఫాంపై తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న వరంగల్‌ పోలీసులు అవాక్కయ్యారు. బాహుబలిని తలపించే రీతిలో కనిపించిన అతని శరీర దారుఢ్యాన్ని చూసి వారు ఖంగుతిన్నారు. వెంటనే అతని షర్టు విప్పి చూసి నివ్వేరపోయారు. ఒంటి చుట్టూ తెల్లటి గుడ్డ..అందులో ఎండు గంజాయి కనిపించడంతో ఆశ్చర్యపోయారు.
ఆర్పీఎఫ్‌ సిబ్బంది వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో సాధారణ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో చిక్కారు. వారి చేతిలో ఒక తెల్లని గుడ్డ సంచి పట్టుకుని అటుఇటు తచ్చడుతూ కనిపించారు. వారిని విచారించగా..వారు మహారాష్ట్రకు చెందిన సంజయ్‌ వినాయక కొంపల్‌, యోగేష్‌ దివాకర్‌ లుగా గుర్తించారు. వారిని తనిఖీ చేయగా, ఒంటికి చుట్టుకుని వారివద్ద 12 కేజీల ఎండు గంజాయి లభించింది. ఈ గంజాయిని ఒడిస్సా నుండి అక్రమంగా తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు.