షిప్‌యార్డ్‌ మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం..

హిందూస్తాన్ షిప్‌యార్డ్‌ మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని యాజమాన్యం ప్రకటించింది.

షిప్‌యార్డ్‌ మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం..

Vizag Shipyard Incident: హిందూస్తాన్ షిప్‌యార్డ్‌ మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని యాజమాన్యం ప్రకటించింది. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగడంతో మంత్రి అవంతీ శ్రీనివాస్ కంపెనీతో, బాధిత కుటుంబాలతో చర్చలు జరిపారు.

మంత్రి అవంతీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ”షిప్‌యార్డ్ ప్రమాదం దురదృష్టకరమని.. హిందూస్తాన్ షిప్‌యార్డ్ చరిత్రలో ఇదే తొలి దుర్ఘటన” అని విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన ఒప్పంద కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు సంస్థలో నిరంతర ఉపాధి కల్పిస్తామని.. శాశ్వత ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగంతో పాటు హెచ్ఎస్ఎల్ ద్వారా వచ్చే ప్రయోజనాలు అదనంగా ఇప్పిస్తామన్నారు.

‌ఇక హిందూస్తాన్ కంపెనీ సీఎండీ మాట్లాడుతూ ”మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అటు కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా రూ. 50 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. కాగా, హిందూస్తాన్ షిప్ యార్డ్ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు.

Also Read: కరోనా డేంజర్ బెల్స్.. ఏపీలోని పలు జిల్లాల్లో లాక్‌డౌన్.!

Click on your DTH Provider to Add TV9 Telugu