Vivo Y38 5G: మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో వివో కొత్త ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవుగా..
వివో వై38 స్మార్ట్ ఫోన్‌లో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించనున్నారు. ఇక ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే కంపెనీ మాత్రం ఇప్పటి వరకు ఈ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు...

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో త్వరలోనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. వివో వై38 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను మిడ్ రేంజ్ బడ్జెట్‌లో తీసుకురానున్నారు. ఇంతకి ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వివో వై38 స్మార్ట్ ఫోన్‌లో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించనున్నారు. ఇక ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే కంపెనీ మాత్రం ఇప్పటి వరకు ఈ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వీటి ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్లో 6.56 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది HD+ రిజల్యూషన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్ సొంతంగా చెబుతున్నారు. ఇక ఈ ఫోన్ వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌తో తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బ్లూటూత్ 5.1 కనెక్టివిటీని అందించారు. 18 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. త్వరలోనే ఈ ఫోన్‌కు సంబంధించి వివో అధికారిక ప్రకటన చేయనుంది. ఇక ధర విషయానికొస్తే రూ. 25,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే లాంచింగ్ ఆఫర్ లో భాగంగా ధర మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటన్నింటిపై ఓ క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..
