AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పల్‌లో విఫలమైనా.. కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?

Virat Kohli: ఈ గణాంకాలే విరాట్ కోహ్లీ ఎంతటి గొప్ప జట్టు ఆటగాడో (టీమ్ ప్లేయర్) స్పష్టం చేస్తున్నాయి. జట్టును ముందుకు నడిపించడంలో ఆయనకు ఆయనే సాటి అని మరోసారి నిరూపితమైంది.క్రికెట్ ప్రపంచంలో రికార్డుల వేటలో విరాట్ కోహ్లీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

ఉప్పల్‌లో విఫలమైనా.. కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
Virat Kohli
Venkata Chari
|

Updated on: May 22, 2026 | 11:09 PM

Share

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రథసారథి విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో మరో అద్భుత మైలురాయిని అందుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తక్కువ పరుగులకే అవుటైనప్పటికీ, టీ20 క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుని సంచలనం సృష్టించాడు.

హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం.. ఆర్‌సీబీ ముందు భారీ లక్ష్యం..

ప్లేఆఫ్స్ రేసులో ముందంజ వేయడమే లక్ష్యంగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లాట్ పిచ్‌పై హైదరాబాద్ బ్యాటర్లు ఆర్‌సీబీ బౌలర్లను చీల్చిచెండారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ ఒకరిని మించి ఒకరు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్‌సీబీని పాయింట్ల పట్టికలో వెనక్కి నెట్టాలంటే హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో 87 పరుగుల తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కోహ్లీ నిరాశపరిచినా.. ముగియని రికార్డుల పరంపర..

భారీ లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ సరికొత్త ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగింది. కొత్త ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే సన్‌రైజర్స్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. మరోవైపు ఈ సీజన్ అంతా నిలకడగా ఆడుతూ ఆర్‌సీబీకి వెన్నెముకగా నిలిచిన విరాట్ కోహ్లీ మాత్రం ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. 11 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే ఈ స్వల్ప స్కోరు ఇన్నింగ్స్‌లోనే కోహ్లీ ఒక సంచలన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అగ్రస్థానం.. అలెక్స్ హేల్స్ రికార్డు బద్దలు..

ఈ మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్‌తో కలిసి కోహ్లీ మొదటి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ యాభై పరుగుల భాగస్వామ్యంతో పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాల్లో (పార్టనర్‌షిప్స్) భాగస్వామిగా నిలిచిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ అలెక్స్ హేల్స్ నెలకొల్పిన 210 యాభై పరుగుల భాగస్వామ్యాల రికార్డును కోహ్లీ అధిగమించాడు.

టీ20 క్రికెట్‌లో అత్యధిక 50+ భాగస్వామ్యాల్లో ఉన్న టాప్ బ్యాటర్లు:

విరాట్ కోహ్లీ – 211 సార్లు

అలెక్స్ హేల్స్ – 210 సార్లు

డేవిడ్ వార్నర్ – 200 సార్లు

బాబర్ ఆజం – 196 సార్లు

క్రిస్ గేల్ – 191 సార్లు

ఈ గణాంకాలే విరాట్ కోహ్లీ ఎంతటి గొప్ప జట్టు ఆటగాడో (టీమ్ ప్లేయర్) స్పష్టం చేస్తున్నాయి. జట్టును ముందుకు నడిపించడంలో ఆయనకు ఆయనే సాటి అని మరోసారి నిరూపితమైంది.క్రికెట్ ప్రపంచంలో రికార్డుల వేటలో విరాట్ కోహ్లీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. మ్యాచ్‌లో వ్యక్తిగతంగా విఫలమైనా, జట్టు కోసం ఆడే క్రమంలో లభించిన ఈ అరుదైన రికార్డు కోహ్లీ కెరీర్‌లో మరో కలికితురాయిగా నిలిచిపోతుంది. ‘కింగ్ కోహ్లీ’ ఎందుకు అంత ప్రత్యేకమో ఈ రికార్డే సమాధానం చెబుతోంది.

Follow Us
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?