AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : చెరువులో నీళ్లు తాగుతున్న సింహం..! దాని ముక్కులోకి వెళ్లడానికి ప్రయత్నించిన తాబేలు.. వైరల్ వీడియో..

Viral Video : సింహం గర్జన వినగానే అడవిలోని జంతువులన్నీ పారిపోతాయి. సింహం ఎక్కడికి వెళ్ళినా అక్కడ నిశ్శబ్దం ఉంటుంది.

Viral Video : చెరువులో నీళ్లు తాగుతున్న సింహం..! దాని ముక్కులోకి వెళ్లడానికి ప్రయత్నించిన తాబేలు.. వైరల్ వీడియో..
Lion Drinking Water
uppula Raju
|

Updated on: Jun 08, 2021 | 10:49 PM

Share

Viral Video : సింహం గర్జన వినగానే అడవిలోని జంతువులన్నీ పారిపోతాయి. సింహం ఎక్కడికి వెళ్ళినా అక్కడ నిశ్శబ్దం ఉంటుంది. అడవిలో సింహానికి భయపడని ఏ జంతువు లేదు. చాలా జంతువులు సింహం నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాయి. కానీ ఒక వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక చిన్న తాబేలు.. సింహం ముక్కులో చొరబడడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

చెరువులో ప్రశాంతంగా నీరు తాగుతున్న సింహాన్ని నీటిలో ఉన్న తాబేలు గమనిస్తుంది. సింహం దగ్గరకు వచ్చి దాని ముక్కు దగ్గర తలను అటూ ఇటూ తిప్పుతుంది. ఇలా చేస్తూ సింహాన్ని నీళ్లు తాగకుండా చేస్తుంది. అంతేకాదు సింహం వెళ్లిపోతున్న సమయంలో దాని వెంబడి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అడవికి రాజైన సింహాన్ని ఒక చిన్న కొలనులో ఉండే తాబేలు ఇబ్బంది పెట్టడం విచిత్రంగా ఉంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో @WildCaptured అనే ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది. ఈ వీడియో ఇంటర్నెట్ ప్రపంచానికి చేరుకోవడంతో అప్పటి నుంచి ప్రజలు దీనిపై తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. వీడియో చూసిన తరువాత ఒక నెటిజన్ సింహాన్ని ఇబ్బంది పెట్టడంలో ఏదో పొరపాటు ఉందని వ్యాఖ్యానించాడు. లేకపోతే సింహం చుట్టూ కొట్టడానికి కూడా ఎవరూ ప్రయత్నించరు.

తెలంగాణ కేబినెట్ భారీ నిర్ణయాలు.. జిల్లా కేంద్రాల్లో వైద్య సేవలను పెంచుతూ కీలక ప్రకటన

Indian Railways: త్వరలో మరో వంద ప్రయాణీకుల రైళ్ళు పట్టాలు ఎక్కుతాయి.. రైల్వే బోర్డు చైర్మన్ సీఈఓ సునిత్ శర్మ

TS Cabinet Meeting Highlights: లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పది రోజులు పొడిగింపు