AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాయులీన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి

సుప్రసిద్ధ వాయులీన విద్వాంసుడు టీఎన్‌ కృష్ణన్‌ కన్నుమూశారు.. ఆయన మరణంతో సంగీత ప్రపంచానికి తీరని లోటు.. కర్ణాటక సంగీతంలో వయోలిన్‌ త్రిమూర్తులలో ఒకరైన కృష్ణన్‌ గత రాత్రి చెన్నైలో మరణించారు.

వాయులీన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి
Balu
|

Updated on: Nov 04, 2020 | 11:07 AM

Share

సుప్రసిద్ధ వాయులీన విద్వాంసుడు టీఎన్‌ కృష్ణన్‌ కన్నుమూశారు.. ఆయన మరణంతో సంగీత ప్రపంచానికి తీరని లోటు.. కర్ణాటక సంగీతంలో వయోలిన్‌ త్రిమూర్తులలో ఒకరైన కృష్ణన్‌ గత రాత్రి చెన్నైలో మరణించారు. లాల్‌గుడి జీ జయరామన్‌, ఎమ్‌ఎస్‌ గోపాలకృష్ణన్‌లు ఏడేళ్ల కిందటే కాలధర్మం చేశారు.. కేరళలోని తిరుపణిత్తూరులో 1928, అక్టోబర్‌ 6న జన్మించిన తిరుపణిత్తూరు నారాయణ అయ్యర్‌ కృష్ణన్‌ చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి అభిరుచి పెంచుకున్నారు. నాలుగేళ్ల పసిప్రాయంలోనే తండ్రి నారాయణన్‌ అయ్యర్‌ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. పదకొండేళ్ల వయసులోనే కచేరీలు చేశారు.. బాల్యంలోనే ఆనాటి సంగీత ద్రష్టలు అరైకుడి రామానుజ అయ్యంగార్‌, చెంబై వైద్యానాధ బాగవతార్‌, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్‌, మహారాజపురం విశ్వనాథ అయ్యర్‌, ఎమ్‌డి రామనాథన్‌, అళత్తూర్‌ సోదరులు వంటి వారి గాత్ర కచేరీల్లో వారి సరసన వయోలిన్‌ వాయించారు.. వాయులీనంలో మరిన్ని సంగతులు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో 1942లో మద్రాస్‌కు వచ్చారు. అక్కడ శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌ను కలుసుకున్నారు. శెమ్మంగుడి శిక్షణలో కృష్ణన్ మరింత రాటుదేలారు.. అన్నట్టు కృష్ణన్‌ మద్రాస్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త అయ్యదురై ఇంట్లోనే ఉన్నారు. అయ్యదురై దంపతులు కృష్ణన్‌ను కన్న బిడ్డలా చూసుకున్నారు. వాయులీనంలో పేరు ప్రఖ్యాతులను గడించిన కృష్ణన్‌ సంగీతంలో అనేక ప్రయోగాలు చేశారు.. మద్రాస్‌ సంగీత కళాశాలలో ప్రొఫెసర్‌గా, అనంతరం యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ డీన్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. దేశ విదేశాలలో అనేక కచేరీలు ఇచ్చారు. హిందుస్తానీ విద్వాంసులు ఉస్తాద్‌ అమ్జద్‌ అలీఖాన్‌, జాకీర్‌ హుస్సేన్‌ వారితో కలిసి చేసిన జుగల్‌బందీలు శ్రోతలను అమితంగా ఆకట్టుకున్నాయి.. టి.ఎన్‌.కృష్ణన్‌ సోదరి ఎన్‌.రాజం కూడా వయోలిన్‌ విద్వాంసురాలే. భారత ప్రభుత్వం 1973లో కృష్ణన్‌ను పద్మశ్రీతో, 1992లో పద్మభూషణ్‌తో సత్కరించింది.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!