ఎర్రచందనం స్మగ్లర్ల సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్
కడప ఎర్రచందనం స్మగ్లర్ల సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న వాహనాన్ని హైజాక్ చేసి దుంగలను

Red Sandal Smugglers Death: కడప ఎర్రచందనం స్మగ్లర్ల సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న వాహనాన్ని హైజాక్ చేసి దుంగలను లాక్కోవాలని అంతర్జాతీయ స్మగ్లర్ భాషా భాయ్ గ్యాంగ్ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇక భాషా భాయ్ పన్నాగంలో భాగంగా స్కార్పియోను చేజ్ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. (రాజశేఖర్ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది: జీవిత)
వెనుక ఫాలో అయిన ఎథియోస్ వాహనంలోని భాషా భాయ్ గ్యాంగ్.. రెండు కార్లు తగులబడుతున్నప్పుడే కారు డోర్లు తెరుచుకొని పరారయ్యారు. బెంగళూరు కేంద్రంగా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేస్తున్న భాషా భాయ్.. కూలీలను అడవిలోకి పంపి దుంగలు తేవాలంటే బోలెడు ఖర్చు అవుతుందని ఇలా హైజాగ్ చేస్తుంటాడు. భాషా భాయ్ గ్యాంగ్ కోసం ప్రస్తుతం కడప పోలీసులు గాలిస్తున్నారు. ( హైదరాబాద్‌లో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్‌లు)