బెజవాడ దుర్గమ్మ గుడిలో కరోనా కలవరం

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వికృత రూపం దాల్చుతోంది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా విస్తరిస్తోంది. అటు ఆలయాల్లో కరోనా కలవరాన్ని కలిగిస్తోంది. విజయవాడ దర్గ గుడిలో కరోనా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

బెజవాడ దుర్గమ్మ గుడిలో కరోనా కలవరం

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వికృత రూపం దాల్చుతోంది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా విస్తరిస్తోంది. అటు ఆలయాల్లో కరోనా కలవరాన్ని కలిగిస్తోంది. విజయవాడ దర్గ గుడిలో కరోనా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఆలయ ఈవో పాటు పూజారి కొవిడ్ బారినపడ్డట్లు అధికారులు వెల్లడించారు. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో పనిచేస్తున్న వేదపండితుడు రామకృష్ణ ఘనాపాటి కరోనా బారినపడి మరణించారు. మూడురోజుల క్రితం కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే గురువారం ఆయన కన్నుమూశారు. ఆయన భార్య కూడా ప్రస్తుతం ఐసీయూలో కరోనాతో చికిత్స పొందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా, దేవస్థానం ఈవో కొద్దిరోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. కాగా, ఈవో సహా ఇప్పటి వరకు దుర్గగుడిలో 18 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు, శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చేవారు కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆలయ కమిటీ సూచిస్తోంది.

Click on your DTH Provider to Add TV9 Telugu