Vijay Devarakonda Hero Movie: దేవరకొండ.. ‘హీరో’ మూవీ నిలిచిపోయిందా..?
విజయ్ దేవరకొండ, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆనంద్ అన్నమలై తెరకెక్కిస్తున్న చిత్రం 'హీరో'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగిపోయిందని తాజాగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి...

Vijay Devarakonda Movie: విజయ్ దేవరకొండ, మాళవిక మోహనన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆనంద్ అన్నమలై తెరకెక్కిస్తున్న చిత్రం ‘హీరో’. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను ఢిల్లీలో జరుపుకుంది. ఇందులో విజయ్ బైక్ రైడర్‌గా కనిపించనున్నాడని ప్రచారం కూడా జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగిపోయిందని తాజాగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read: Director Venky Kudumula Responds On Naga Shourya Allegations
రీసెంట్‌గా విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా టాక్‌తో.. ‘హీరో’ మూవీని ఆపేశారని.. విజయ్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందుకే ఆ చిత్రంపై ఎటువంటి అప్డేట్స్ రావట్లేదని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
కాగా, ప్రస్తుతం విజయ్ దేవరకొండ దర్శకుడు పూరి జగన్నాధ్‌తో ‘ఫైటర్’ అనే ప్యాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.