అలియాకు ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా.? 

07 April 2025

Prudvi Battula 

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథానాయికలలో అలియా భట్ ఒకరు. పెళ్లైనా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ.

ఇండస్ట్రీలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న తారలలో అలియా ఒకరు. నివేదికల ప్రకారం అలియా ఆస్తుల విలువ రూ. 550 కోట్లు.

ఒక్కో సినిమాకు ఈ ముద్దుగుమ్మ దాదాపు రూ. 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఓ మూవీ చేసిన సంగతి తెలిసిందే.

అలాగే ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది. సొంత నిర్మాణ సంస్థపై ఇప్పటికే అనేక మూవీస్, సిరీస్ నిర్మించింది.

అంతేకాకుండా అనేక వ్యాపారసంస్థలలో పెట్టుబడులు పెట్టింది అలియా. ముంబైలో రూ.32 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేసింది బాలీవుడ్ తార.

లండన్ లో రూ.25 కోట్ల ఇంటిని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆమె వద్ద BMW 7 సిరీస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్‌ కార్లు ఉన్నాయి.

గంగూబాయి కతియావాడి సినిమాలో నటనకుగానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. గంగూబాయి పాత్రకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి.

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అలియా. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‏ను వివాహం చేసుకుంది. వీరికి రాహా అనే పాప జన్మించింది.