చిరు మూవీకి పాజిటివ్ టాక్.. నిర్మాతలకు భారీ నష్టాలు..
06 April 2025
Prudvi Battula
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అయితే అందరి హీరోల్లాగే ఆయన కెరీర్‌లో కొన్ని ప్లాఫులున్నాయి.
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చారు. ఇది 100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించి పెట్టింది.
దీని తర్వాత స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమాలో నటించారు చిరంజీవి.
కొణిదెల ప్రొడక్షన్‌లో రూ. 200 కోట్లతో సైరా సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
2019లో రిలీజైన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ నటీనటులు ఉండడంతో ఇతర భాషల్లోనూ క్రేజ్ వచ్చింది.
అయితే భారీ బడ్జెట్ మూవీ కావడంతో చాలా చోట్ల నష్టాలు వచ్చాయి. ఇదే విషయాన్ని ఇటీవల మళ్లీ గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.
సైరా సినిమా తెలుగు రాష్ట్రాల్లో అంతగా మెప్పించలేదు. కానీ మిగిలన రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ఈ సినిమా వల్ల భారీగానే నష్టపోయామన్నారు చిరంజీవి.
గతంలోనూ ఇదే తరహాలో చిరంజీవి తమ్ముడు నాగబాబు నిర్మించిన రుద్రవీణ సినిమాకు ప్రశంసలు వచ్చినా కలెక్షన్లు రాలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తారక్ గాత్రదానం చేసిన పాటలు ఇవే..
ముందు కల్కి ఆఫర్ రిజెక్ట్ చేశా: కీర్తి..
ఈ రికార్డ్స్ బాలయ్యకి మాత్రమే సొంతం..