Vidura Niti: మనిషి లోభం విడిచి..మనసు అదుపులో పెట్టుకోవాలి… మేలు చేసిన వాడికి కీడు చేస్తే వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు..

|

Sep 12, 2021 | 2:57 PM

Mahabharata-Vidura Niti: మన పురాణాహితిహాసాలు మనిషి జీవన నడవడిక ఎలా ఉండాలి.. ఏది మంచి ఏది చేడు వంటి అనేక విషయాలను తెలిపాయి. వీటిని ఆధునిక మానవుడు తెలుసుకోవడం.. వాటిని జీవితంలో..

Vidura Niti: మనిషి లోభం విడిచి..మనసు అదుపులో పెట్టుకోవాలి... మేలు చేసిన వాడికి కీడు చేస్తే వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు..
Vidura Niti
Follow us on

Mahabharata-Vidura Niti: మన పురాణాహితిహాసాలు మనిషి జీవన నడవడిక ఎలా ఉండాలి.. ఏది మంచి ఏది చేడు వంటి అనేక విషయాలను తెలిపాయి. వీటిని ఆధునిక మానవుడు తెలుసుకోవడం.. వాటిని జీవితంలో ఆచరించడం అత్యవసరం. పంచమవేదంగా ప్రసిద్ధి గాంచిన మహాభారతం ఉద్యోగపర్వంలో విదుర నీతి అనుసరించదగింది. ఇందులో ధృతరాష్ట్రు మహారాజుకి సందర్భానుసారంగా విదురుని చేత చెప్పించిన సామజిక రాజకీయ, కుటుంబ జీవనానికి చెందిన నీతి శాస్త్ర విషయాలు “విదురనీతి” లుగా ప్రసిద్ధి చెందాయి. ఒక మనిషి మనిషిగా సమాజంలో జీవించాలంటే ధర్మార్ధ కామ మొక్షాలనే చతుర్విధ పురుషార్థాల సాధన కోసం చేయాల్సిన పనులు పూర్తిగా వివరించాడు విదురుడు. ఈ విదురు చెప్పిన వానిలో రాజధర్మం, సామాన్య ధర్మం ఎల్లవేళలా మనిషి నైతిక, ధార్మిక జీవన విధానం వివరించాడు. దృతరాష్ట్రుడుకి విదురుడు ఇచ్చిన బదులు విదురనీతిగా ప్రసిద్ధి పొందింది. ఈరోజు ఉపకారం చేసినవానికి అపకారం చేస్తే.. ఏ విధమైన జీవితం లభిస్తుందో విదురుడు చెప్పిన కథ గురించి తెలుసుకుందాం..

మేలు చేసిన వాడికి కీడు చేసిన వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు.

ధృతరాష్ట్ర మహారాజా నీ తమ్ముడు పాండు రాజు నీకు పరమ భక్తుడు.. ఇక పాండవులు నీకెంతో మేలు చేసారు. వారిని ఆదరించడం మంచిది.  ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం. దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది, మతి చెడుతుంది, శరీరం కృశిస్తుంది, రోగం వస్తుంది శత్రువుకు అది బలాన్ని చేకూరుస్తుంది కనుక దు॰ఖించడంమానుని చెప్పాడు విదురుడు.

వెంటనే దృతరాష్ట్రుడు ” విదురా..  నేను ధర్మతనయుని నా మాటలతో చేతలతో బాధించాను. అందు వలన నా కుమారులకు మరణం తధ్యం. నేను దుఃఖించక ఎలా ఉండగలను ” అన్నాడు. విదురుడు ” రాజా.. నీవు లోభం విడిచి మనసు అదుపులో పెట్టుకుంటే మనశ్శాంతి అదే లభిస్తుంది . జ్ఞాతి వైరం వదిలి పెట్టు. గోవులను, బ్రాహ్మణులను అగౌరవ పరచ వద్దు. అన్నదమ్ములు కలిసి ఉండేలా చూడు. ఒక్క చెట్టును కూల్చడం తేలిక అదే అనేక చెట్లు ఒకటిగా ఉండగా పెను గాలి కూడా వాటిని కూల్చ లేదు. కనుక  పాండు పుత్రులను పిలిచి వారికి హితం కలిగించి నీ పుత్రులను బ్రతికించుకో. జూదం ఆడిన నాడే నేను వద్దని చెప్పాను నీవు విన లేదు. కాకుల వంటి నీ కుమారులను నమ్మి నెమళ్ళ వంటి పాండవులను వదులుకుని ఇప్పుడు తల్లడిల్లి పోతున్నావు. కుల నాశకుడైన కుమారుని వదిలితే వచ్చే నష్టం ఏమిటి. భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, పాండుపుత్రులు సుయోధనాది పుత్రులు మనుమలైన లక్ష్మణ కుమారుడు, అభిమన్యుడు నిన్ను సేవిస్తుంటే నీ వైభవం ఎలా ఉంటుంది. శత్రు రహితమైన ఆ వైభవంతో సాటి ఏమి ? ” అన్నాడు.

దృతరాష్ట్రుడు ” విదురా! నీవు చెప్పిన మాటలు బాగున్నా నా కుమారులను వదల లేను కనుక ధర్మం జయిస్తుంది ” అన్నాడు. విదురుడు ” రాజా! నీవు నీ కుమారులను వదల వద్దు పాండవులను దూరం చేసుకోవద్దని మాత్రమే నేను చెప్తున్నాను. నీ కుమారులను ఒప్పించి పాండవులకు ఐదు ఊళ్ళైనా ఇప్పించు. యుద్ధం నివారించడానికి కొడుకులను వదల మన్నాను కాని సంధి చేసుకుంటే అందరికీ క్షేమమే కదా!  ఎన్ని భోగాలు అనుభవించినా మహారాజులకైనా చావు తప్పదు.  కనుక నీకొడుకులను సంంధికి ఒప్పించు ధర్మరాజును శాంత పరచు” అన్నాడు విదురుడు. సమాజానికి ఎప్పటికీ పనికి వచ్చే విధంగా చెప్పిన విదురుని మాటలు.. అజరామరం. అందుకనే మహాభారతం పంచమవేదంగా ఖ్యాతిగాంచింది.

Also Read :

వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు..? విశేషం ఏమిటంటే..!