అంబేద్కర్ విగ్రహాలే లేకుంటే.. వైఎస్ స్టాచ్యూ ఎందుకు..?: వీహెచ్

హైదరాబాద్‌ పంజాగుట్టలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ తెల్లవారుజామునే ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహాన్ని తరలించడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం లేనప్పుడు వైఎస్ విగ్రహం ఎందుకని ప్రశ్నించారు. తన సొంత ఖర్చుతో విగ్రహం తయారు చేయించానని.. గతంలో ఎక్కడైతే పూజ చేశామో.. అక్కడే అంబేద్కర్ విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ఈ సాయంత్రంలోగా అంబేద్కర్ విగ్రహాన్ని తనకు అప్పగించాలని.. లేకపోతే హైదరాబాద్‌లోని వైఎస్ విగ్రహాలను కూల్చేస్తామని ఆయన హెచ్చరించారు. […]

అంబేద్కర్ విగ్రహాలే లేకుంటే.. వైఎస్ స్టాచ్యూ ఎందుకు..?: వీహెచ్
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2019 | 10:25 AM

హైదరాబాద్‌ పంజాగుట్టలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ తెల్లవారుజామునే ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహాన్ని తరలించడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం లేనప్పుడు వైఎస్ విగ్రహం ఎందుకని ప్రశ్నించారు. తన సొంత ఖర్చుతో విగ్రహం తయారు చేయించానని.. గతంలో ఎక్కడైతే పూజ చేశామో.. అక్కడే అంబేద్కర్ విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ఈ సాయంత్రంలోగా అంబేద్కర్ విగ్రహాన్ని తనకు అప్పగించాలని.. లేకపోతే హైదరాబాద్‌లోని వైఎస్ విగ్రహాలను కూల్చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉంటే అంబేద్కర్ విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించేందుకు అనుమతి లేదన్నారు పోలీసులు. అనుమతి వచ్చాక విగ్రహ ప్రతిష్టకు తమకు అభ్యంతరం లేదని ఏసీపీ తిరుపతన్న వెల్లడించారు. విగ్రహ ప్రతిష్టను పోలీసులు అడ్డుకోవడంతో.. పోలీసులకు, వీహెచ్ అనుచరులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ వీహెచ్.. వైఎస్ విగ్రహం ఎదుట ఆయన బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో… వీహెచ్ ను అదుపులోకి తీసుకుని బొల్లారం పీఎస్ కు తరలించారు.