AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మీ ఇంట్లో టీవీ సరైనా దిశలోనే ఉందా..? లేదంటే వెంటనే మార్చేయండి..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతిచోటా టీవీ పెట్టడం వల్ల వాస్తు దోషం వస్తుంది. దీంతో ఇంటి యజమాని అనేక సమస్యలతో పాటు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నట్లు చెబుతున్నారు.

Vastu Tips: మీ ఇంట్లో టీవీ సరైనా దిశలోనే ఉందా..? లేదంటే వెంటనే మార్చేయండి..
Direction For TV
Jyothi Gadda
|

Updated on: Nov 23, 2022 | 3:14 PM

Share

ఇంట్లో ఏ గది ఏ దిక్కున ఉండాలి. ఏ దిక్కున పడుకోవాలి, ఏ వస్తువులు ఏ దిక్కున ఉంచాలి అనే విషయాలను వాస్తులో సమగ్రంగా తెలియజేసారు. వాస్తు ప్రకారం.. తలుపులు, కిటికీల నుండి వంటగది, పడకగది, బాత్రూమ్ వరకు ప్రతిదీ సరైన దిశలో ఉంచాలని సిఫార్సు చేయబడింది. అలాగే టీవీని ఇంట్లో పెట్టడానికి సరైన దిక్కు ఏది..? ఏ దిక్కున టీవీ పెట్టడం వల్ల నష్టం కలుగుతుంది. ఇంటి ప్రవేశ ద్వారం ముందు టీవీని ఎప్పుడూ ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య కలహాల వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో టీవీని ఉంచడానికి సరైన దిశ ఏమిటో తెలుసా..?

వాస్తు శాస్త్రంలో ప్రతి పనికి దిశానిర్దేశం చేస్తారు. వాస్తులో ఇంటి ప్రధాన ద్వారం కిటికీలు, తలుపుల నుండి వంటగది, పడకగది, బాత్రూమ్ వరకు ప్రతిదానికీ నిర్దిష్ట దిశను ఇవ్వబడింది. అదేవిధంగా వాస్తు శాస్త్రం కూడా ఇంట్లో ఉంచవలసిన వస్తువులకు కొన్ని సూచనలు ఇస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతిచోటా టీవీ పెట్టడం వల్ల వాస్తు దోషం వస్తుంది. దీంతో ఇంటి యజమాని అనేక సమస్యలతో పాటు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నట్లు చెబుతున్నారు. అలా అయితే ఇంట్లో టీవీని ఏ దిశలో ఉంచాలో ఇక్కడ తెలసుకుందాం.

వాస్తు ప్రకారం ఇంట్లో టీవీని ఉంచడానికి ఇది సరైన దిశ: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో టీవీని ఉంచడానికి ఆగ్నేయం లేదా తూర్పు దిశ సరైనది. ఈ దిశలో టీవీని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

వాస్తు ప్రకారం టీవీ చూస్తున్నప్పుడు తూర్పు వైపు ఉండాలి. అలాగే, ఇంటి ప్రవేశ ద్వారం ముందు టీవీని ఎప్పుడూ ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య కలహాల వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో ఈశాన్య మూలలో ఎప్పుడూ టీవీ పెట్టకండి. ఈ దిశలో టీవీని ఉంచడం వల్ల సానుకూల శక్తి మార్గాన్ని అడ్డుకుంటుంది. ఇంట్లో ప్రతికూలత వస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం.. బెడ్‌రూమ్‌లో టీవీని ఉంచడం మంచిది కాదు. మీరు మీ పడకగదిలో టీవీని పెట్టాలని నిర్ణయించుకున్నట్లయితే, కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. పడకగదిలో టీవీని ఆగ్నేయ దిశలో అంటే ఆగ్నేయ కోణంలో ఉంచాలి. అలాగే బెడ్ రూమ్ మధ్యలో టీవీ ఉండకూడదు. ఎందుకంటే, ఇది వ్యక్తిగత జీవితంలో సమస్యలను సృష్టిస్తుందని అంటారు.

టీవీని ఇన్‌స్టాల్ చేయడం, వాస్తు శాస్త్రంలో దాని ఉపయోగం గురించి కొంత సమాచారం ఇవ్వబడింది. వాస్తు ప్రకారం టీవీని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. దానిపై దుమ్ము ధూళి పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది. నెగెటివ్ ఎనర్జీ వల్ల భారీగా నష్టపోవాల్సి వస్తోందన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి