IPL 2023: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. గాయం నుంచి కోలుకున్న స్టార్ బౌలర్.. ప్రాక్టీస్ కూడా షురూ..
Jofra Archer: ఐపీఎల్ 2023కి ముందు ముంబై ఇండియన్స్‌కు గొప్ప శుభవార్త రాబోతోంది. ఇంగ్లాండ్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం నుంచి కోలుకున్నాడు.
ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం డిసెంబర్ 23న జరగనుంది. ఈ వేలానికి ముందు అత్యధిక సార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు గొప్ప శుభవార్త రాబోతోంది. ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం నుంచి కోలుకున్నాడు. దీంతో పాటు బౌలింగ్‌లో కూడా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. జోఫ్రా బౌలింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జోఫ్రా ఆర్చర్ ప్రాక్టీస్ ప్రారంభం..
ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, చాలా కాలంగా గాయం కారణంగా మైదానానికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతను చాలా వరకు ఫిట్‌గా ఉన్నాడు. అతను IPL 2023 లో ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. జోఫ్రా బౌలింగ్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. జోఫ్రా బౌలింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, జోఫ్రా మళ్లీ తన పాత రిథమ్‌కి తిరిగి రావడం కనిపించింది.
Jofra Archer bowling in England whites, to Zak Crawley pic.twitter.com/Z8Z8appECw
— Will Macpherson (@willis_macp) November 23, 2022
క్రిక్‌బజ్‌తో మాట్లాడుతున్నప్పుడు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి కొద్ది రోజుల క్రితం ‘అతను ప్రస్తుతం ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో యూఏఈలో పునరావాసం పొందుతున్నాడు. అతను గొప్ప పురోగతి సాధిస్తున్నాడు. కోలుకున్న తీరు చూస్తుంటే 2023 ప్రారంభం నుంచి మళ్లీ క్రికెట్‌లోకి రావచ్చని తెలుస్తోంది. ఐపీఎల్ 2023 మార్చి చివరి నెలలో ప్రారంభమవనుంది. దీనికి ఇంకా చాలా సమయం ఉంది. జోఫ్రా తిరిగి రావడంతో ముంబై ఇండియన్స్‌కు చాలా శుభవార్తగా నిలిచింది.
డిసెంబర్‌లో మెగా వేలం..
2021 నుంచి గాయంతో బాధపడుతున్న జోఫ్రా ఆర్చర్‌ను మెగా వేలంలో ముంబై ఇండియన్స్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్ 2022 ఐపీఎల్ ఆడలేడని తెలిసినా.. జోఫ్రా ఆర్చర్‌ను దక్కించుకుంది. IPL 2023లో తనతోనే ఉంచుకుంది. ఫ్రాంచైజీ జోఫ్రా దీర్ఘకాలిక పెట్టుబడిగా చూస్తున్నారు. జోఫ్రా ఫిట్‌నెస్‌లో మెరుగుదల చూసి, ఫ్రాంచైజీ ఈ ప్రకటన ఖచ్చితంగా సరైనదని తేలింది. జోఫ్రా IPL 2023లో తిరిగి వస్తే, ముంబై ఇండియన్స్ ఆయన నుంచి గొప్పగా ప్రయోజనం పొందనుంది.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..