AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూ కబ్జాలకు పాల్పడాలంటే భయపడాలి… గుజరాత్‌లో మాదిరి చట్టాన్ని తీసుకురావాలి… 14 ఏళ్ల జైలు శిక్ష విధించాలి…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ధ్వజమెత్తారు.

భూ కబ్జాలకు పాల్పడాలంటే భయపడాలి...  గుజరాత్‌లో మాదిరి చట్టాన్ని తీసుకురావాలి... 14 ఏళ్ల జైలు శిక్ష విధించాలి...
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 17, 2020 | 1:09 PM

Share

గుజరాత్ లో ఎవరైన భూకబ్జా కు పాల్పడితే 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారని, తెలంగాణ లో కూడా అలాంటి బిల్లును తీసుకురావాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. జైలు శిక్షలు వేస్తే భూ కబ్జా లకు పాల్పడాలంటే భయపడుతారని అన్నారు. తన చెప్పిన సూచనపై ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం కేసీఆర్ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి మధ్య తరగతి ప్రజలను ఇబ్బందిపెట్టారని, ఇప్పుడు ధరణి పోర్టల్ తీసుకొచ్చి మళ్లీ పేదవారిని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

కేంద్రంపై ఫైర్

కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధర 100 రూపాయలు పెంచడం తగదని అన్నారు. ప్రజల పక్షాన నిలబడుతానన్న బండి సంజయ్ ఇప్పుడు గ్యాస్ ధరల విషయంలో ప్రజలు ఇబ్బందిపడుతున్న విషయాన్ని ప్రధాని మోడీ కి చెప్పు అని సలహా ఇచ్చారు. పేదలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. ఎన్నికల్లో గెలుపే ముఖ్యంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి ప్రజల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భూ కబ్జాలపై, కేంద్రం పెంచిన గ్యాస్ ధరలపై పోరాటం చేస్తామని ప్రకటించారు.

పీసీసీపై స్పందన…

చాలా కాలంగా పీసీసీ మార్పుపై కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరిగాయి. ఉత్తమ్ రాజీనామా చేయడంతో తాజాగా పీసీసీ నూతన అధ్యక్ష ఎంపిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష ఎన్నికపైనా వీహెచ్ స్పందించారు. పీసీసీ అధ్యక్షుడిగా బీసీ కులాలకు చెందిన వారికి ఒకసారి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్లు తెలిపారు. పీసీసీ అనేది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి ఇవ్వాలని కోరినట్లు తెలియజేశారు. కొత్త పీసీసీ అధ్యక్ష ఎన్నికల ఎప్పుడు అనేది హైకమాండ్ చూస్తదని అన్నారు. కాగా, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో జానారెడ్డి సలహా తీసుకొనే ముందుకెళ్తాం అని సలహా ఇచ్చారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!