చూపులేని తల్లి.. కదలలేని తండ్రి.. 600 కిలోమీటర్లు.. ట్రైసైకిల్ పై సొంతూరు చేర్చిన 11ఏళ్ల కుర్రాడు

|

May 26, 2020 | 6:07 PM

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ జనం చేత వింత వింత ఫిట్స్ చేయిస్తోంది. కొందరిలో కనిపించని శక్తిని బయటకు తీస్తోంది. ఇటీవల 15 ఏళ్ల జ్యోతి కుమారి తన గాయపడ్డ తండ్రిని 1,200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కి ఇంటికి సురక్షితం చేర్చింది. జ్యోతి ధైర్యాన్ని మరవక ముందే తాజాగా, 11ఏళ్ల బాలుడు 600 కిలోమీటర్లు ట్రై సైకిల్ తొక్కి తన తల్లిదండ్రుల్ని సురక్షితంగా ఇంటికి చేర్చాడు. బీహార్ ఆరియారియాకు చెందిన దంపతులు ఉత్తర ప్రదేశ్ వారణాసి […]

చూపులేని తల్లి.. కదలలేని తండ్రి.. 600 కిలోమీటర్లు.. ట్రైసైకిల్ పై సొంతూరు చేర్చిన 11ఏళ్ల కుర్రాడు
Follow us on

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ జనం చేత వింత వింత ఫిట్స్ చేయిస్తోంది. కొందరిలో కనిపించని శక్తిని బయటకు తీస్తోంది. ఇటీవల 15 ఏళ్ల జ్యోతి కుమారి తన గాయపడ్డ తండ్రిని 1,200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కి ఇంటికి సురక్షితం చేర్చింది. జ్యోతి ధైర్యాన్ని మరవక ముందే తాజాగా, 11ఏళ్ల బాలుడు 600 కిలోమీటర్లు ట్రై సైకిల్ తొక్కి తన తల్లిదండ్రుల్ని సురక్షితంగా ఇంటికి చేర్చాడు.
బీహార్ ఆరియారియాకు చెందిన దంపతులు ఉత్తర ప్రదేశ్ వారణాసి లో నివసిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా యూపీ నుంచి బీహార్ కు రావాల్సి ఉంది. గాయం కారణంగా కంటి చూపును కోల్పోయిన తల్లిని, మార్బల్ కంపెనీలో పనిచేస్తూ గాయపడ్డ తండ్రిని 11ఏళ్ల బాలుడు తబారక్ స్వగ్రామానికి తరలించాడు. యూపీ నుంచి బీహార్ కు 600కిలోమీటర్లు ట్రై సైకిల్ తొక్కుతూ తల్లిదండ్రుల్ని బాలుడు సురక్షితంగా తీసుకువచ్చినట్లు మీడియా సంస్థ దివైర్ కథనాన్ని ప్రచురించింది.
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కొల్పోయారు. కడుపు నింపుకునేందుకు ఇబ్బంది పడ్డారు. కనీసం సొంతూరుకైనా చేరాలని భావించారు. వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వెళ్లేందుకు మార్గం వెతుకున్నారు. ఇంతలో తమ 11 ఏళ్ల కొడుకు తబారక్ ట్రై సైకిల్ తో సొంతూరుకు వెళ్దామని చెప్పడంతో కాస్త భయపడ్డా.. ప్రయాణం సాగించారు. రహదారి మార్గంలో ప్రజలు అండగా నిలిచారు. భోజన సదుపాయం కల్పించారు. 11ఏళ్ల తన కుమారుడైన తబారక్ తమని ఇంటికి తీసుకువచ్చాడని గర్వంగా చెప్పాడు తండ్రి. ప్రస్తుతం బాలుడి కుటుంబాన్ని జిల్లా అధికారులు క్వారంటైన్ లో ఉంచారు.