గులాబీ నేతలే మాకు జై కొడుతున్నారు.. కాంగ్రెస్ నేత ఖతార్నాక్ కామెంట్..!

హుజూర్‌నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోడానికి కాంగ్రెస్‌ విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనైనా హుజూర్‌నగర్‌లో జెండా ఎగరవేసేందుకు టీఆర్ఎస్ పార్టీ పక్కా ప్లాన్లు వేస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని.. టీవీ9లో జరిగిన ఎన్‌కౌంటర్ విత్ మురళీకృష్ణ ప్రోగ్రామ్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని జిమ్ముక్కులు […]

గులాబీ నేతలే మాకు జై కొడుతున్నారు.. కాంగ్రెస్ నేత ఖతార్నాక్ కామెంట్..!
Follow us

| Edited By:

Updated on: Oct 07, 2019 | 10:12 PM

హుజూర్‌నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోడానికి కాంగ్రెస్‌ విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనైనా హుజూర్‌నగర్‌లో జెండా ఎగరవేసేందుకు టీఆర్ఎస్ పార్టీ పక్కా ప్లాన్లు వేస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని.. టీవీ9లో జరిగిన ఎన్‌కౌంటర్ విత్ మురళీకృష్ణ ప్రోగ్రామ్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని జిమ్ముక్కులు చేసినా.. హుజూర్ నగర్ ప్రజలు పద్మావతి రెడ్డినే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. హుజూర్ నగర్‌లో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా.. అది టీఆర్ఎస్ పార్టీకే నష్టమన్నారు. సీపీఐ పార్టీ టీఆర్ఎస్‌కు మద్ధతు తెల్పడంతో ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందన్నారు. టీఆర్ఎస్ పార్టీతో సీపీఐ చేతులు కలపడం తనను భాధించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అయితే ప్రస్తుతం టీడీపీ, సీపీఐ మద్దతు లేకున్నా.. ఖచ్చితంగా విజయం సాధిస్తామని అన్నారు. రాష్ట్రంలో సగం మంది టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ గెలవాలని ఆశిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చూశారు. అంతేకాదు హుజూర్ నగర్ ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితేంటనేది ఉత్తమ్ కుమార్ మాటల్లోనే  చూడండి..