ఇండియన్స్‌పై ట్రంప్‌ సర్కార్‌ కక్ష..!

ఇండియన్స్‌పై ట్రంప్‌ సర్కార్‌ కక్ష కట్టింది. నిబంధనల పేరుతో మరో సారి దాదాపు 150 మందిని వెనక్కు పంపింది. వీసా గడువు పూర్తయినా అమెరికాలో ఉంటున్నారన్న ఆరోపణలు మోపుతూ వెనక్కు పంపుతున్నారు. వర్క్‌ వీసాపై పని చేస్తున్న మరికొంత మందిని వెనక్కు పంపించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్రమ వలసదారులపై ట్రంప్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నారన్న నెపంతో 150 మంది భారతీయులను వెనక్కు పంపించింది. వారంతా […]

ఇండియన్స్‌పై ట్రంప్‌ సర్కార్‌ కక్ష..!
Follow us
Ram Naramaneni

| Edited By: Srinu

Updated on: Nov 21, 2019 | 2:07 PM

ఇండియన్స్‌పై ట్రంప్‌ సర్కార్‌ కక్ష కట్టింది. నిబంధనల పేరుతో మరో సారి దాదాపు 150 మందిని వెనక్కు పంపింది. వీసా గడువు పూర్తయినా అమెరికాలో ఉంటున్నారన్న ఆరోపణలు మోపుతూ వెనక్కు పంపుతున్నారు. వర్క్‌ వీసాపై పని చేస్తున్న మరికొంత మందిని వెనక్కు పంపించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అక్రమ వలసదారులపై ట్రంప్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నారన్న నెపంతో 150 మంది భారతీయులను వెనక్కు పంపించింది. వారంతా త్వరలోనే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఏజెంట్ల ద్వారా అమెరికాలోకి అక్రమంగా చొరబడ్డవారు, వీసా గడువు పూర్తయినా అమెరికాలోనే నివాసముంటున్న భారతీయులు ఈ లిస్టులో ఉన్నారు.

భారతీయులతోపాటు బంగ్లాదేశీయులను, దక్షిణా ఆసియావాసులను కూడా అమెరికా తమ దేశం నుంచి వెళ్లగొట్టింది. ఇదిలా ఉండగా అక్రమ వలసదారుల్లో 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారే అధికంగా ఉన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఏజెంట్లు అక్రమంగా అమెరికాకు పంపించడానికి ఒక్కో వ్యక్తి దగ్గరనుంచి 10 నుంచి 15 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో 23న ఇదే తరహాలో అమెరికా 117 మంది భారతీయులను వెనక్కు పంపిన విషయం తెలిసిందే. అలాగే ఒక మహిళ సహా 311 మందిని మెక్సికో వెనక్కి పంపించింది. డాలర్ల ఆర్జన కలలతో వీరంతా ఒక్కొక్కరు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు అంతర్జాతీయ ఏజెంట్లకు చెల్లించి అక్రమంగా మెక్సికోకు చేరుకోగలిగారని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అప్పట్లో ధ్రువీకరించారు. అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో అక్కడి అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. దీంతో అక్రమంగా ఆ దేశంలో ఉంటున్న విదేశీయులు వెనక్కి తిరిగి రాక తప్పడం లేదు.