టెక్సాస్ సహా 23 రాష్ట్రాల్లో ట్రంప్ హవా

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు చకచకా వెల్లడవుతున్నాయి. ఇప్పటివరకు ఫ్లోరిడా, టెక్సాస్ సహా 23 రాష్ట్రాలను అధ్యక్షుడు ట్రంప్ కైవసం చేసుకున్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 1:58 pm, Wed, 4 November 20
టెక్సాస్ సహా 23 రాష్ట్రాల్లో ట్రంప్ హవా

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు చకచకా వెల్లడవుతున్నాయి. ఇప్పటివరకు ఫ్లోరిడా, టెక్సాస్ సహా 23 రాష్ట్రాలను అధ్యక్షుడు ట్రంప్ కైవసం చేసుకున్నారు. ఆయన ప్రత్యర్థి డెమొక్రాట్ అభ్యర్థి 18 రాష్ట్రాల్లో తన హవా చాటుకున్నారు. ఆరిజోనా, జార్జియా, మిషిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కావలసి ఉన్నాయి. టెక్సాస్ లో రిపబ్లికన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నప్పటికీ… జో బైడెన్ ట్రంప్ కు గట్టి పోటీనిచ్చారు.    కానీ చివరి నిముషంలో ఓటర్లు ట్రంప్ వైపే మొగ్గు చూపారు.

ఇలా ఉండగా వైట్ హౌస్ వద్ద ట్రంప్ మద్దతుదారులు, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమ సభ్యులు ఘర్షణలకు తలపడ్డారు.  ట్రంప్ అధ్యక్షునిగా తిరిగి ఎన్నికైతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని నల్లజాతీయులు హెచ్ఛరించారు.