భారత్, పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయన్న ట్రంప్

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. పుల్వామా దాడి తర్వాత కశ్మీర్‌ లోయలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్‌, పాక్‌ మధ్య పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులకు రెండు దేశాలు స్వస్తి పలకాలని కోరుకుంటున్నాం. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మేం దీన్ని నిలువరించాలనుకుంటున్నాం. అందులో భాగంగా రెండు దేశాలతో చర్చలు జరుపుతున్నామని ట్రంప్ చెప్పుకొచ్చారు. #WATCH US President Donald […]

భారత్, పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయన్న ట్రంప్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:19 PM

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. పుల్వామా దాడి తర్వాత కశ్మీర్‌ లోయలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్‌, పాక్‌ మధ్య పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులకు రెండు దేశాలు స్వస్తి పలకాలని కోరుకుంటున్నాం. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మేం దీన్ని నిలువరించాలనుకుంటున్నాం. అందులో భాగంగా రెండు దేశాలతో చర్చలు జరుపుతున్నామని ట్రంప్ చెప్పుకొచ్చారు.

పుల్వామా దాడిలో 40 మంది జవాన్లను కోల్పోయిన భారత్‌.. గట్టిగానే ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ట్రంప్ అభిప్రయపడ్డారు. భారత్‌, పాక్‌ మధ్య చాలా సమస్యలున్నాయని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఉన్న సమస్యని చాలా సున్నితంగా పరిష్కరించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. అలాగే పాక్‌తో అమెరికాకు ఉన్న సంబంధాలను సైతం ఆయన గుర్తుచేసుకున్నారు. పాక్‌కు ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చిన 1.3 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లను నిలిపివేశామని తెలిపారు. అమెరికాతో ఆ దేశం సహకరించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

కాగా పుల్వామా దాడి తరువాత అంతర్జాతీయ వేదికలపై పాక్‌ను ఏకాకిని చేయాలని భారత్‌ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అత్యంత ప్రాధాన్యత దేశాల జాబితా నుంచి ఆ దేశాన్ని తొలగించింది. భారత్‌ నుంచి పాక్‌ వెళుతున్న సింధు జలాల్లో మన వాటా నీటిని పూర్తిగా మన అవసరాలకే వాడుకోవాలని నిర్ణయించింది. భద్రతా మండలిలోనూ పాక్‌ను దోషిగా చూపడంలో సఫలమైంది. అలాగే నిన్న జరిగిన ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశంలో కూడా పాకిస్థాన్ కి చుక్కెదురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..