Venkaiah Naidu: సాంకేతిక పరిజ్ఞానంలో నవీన పోకడలను గుర్తించాలి… ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

శాస్త్రీయ విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంజినీరింగ్, గణితం రంగాల్లోని నవీన పోకడల గుర్తించాలని , డాటా సైన్స్ విప్లవానికి ధీటుగా ఉద్యోగ కల్పనలో...

Venkaiah Naidu: సాంకేతిక పరిజ్ఞానంలో నవీన పోకడలను గుర్తించాలి... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Follow us

| Edited By:

Updated on: Jan 05, 2021 | 2:40 PM

Venkaiah Naidu: శాస్త్రీయ విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంజినీరింగ్, గణితం రంగాల్లోని నవీన పోకడల గుర్తించాలని , డాటా సైన్స్ విప్లవానికి ధీటుగా ఉద్యోగ కల్పనలో సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. భారతదేశంలో అత్యధికంగా మహిళా నిపుణులు తయారవుతున్నారని అన్నారు. చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమాటికల్ సైన్సెస్ (ఐఎంఎస్సీ) లో నూతన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నూతన నైపుణ్యానికి ధీటుగా తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు సంప్రదాయ ఇంజినీరింగ్ పాఠ్యాంశాలను నవీకరించాలన్నారు. ఐఐటీల వంటి జాతీయ సంస్థలు అందిస్తున్న దూర విద్య కోర్సుల విస్తరణ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక కోర్సులను అందించాలని సూచించారు.

దేశానికి గర్వకారణమైన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ సేవలను కొనియాడారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపీ అన్బళగన్, ఐఎంఎస్సీ డైరక్టర్ ప్రొఫెసర్‌ వీ అరవింద్, కల్పకం అటమిక్ ఎనర్జీ విభాగం ఐజీసీఏఆర్ డైరక్టర్ డాక్టర్‌ అరుణ్ కుమార్ భాదురి, రిజిస్ట్రార్ విష్ణు ప్రసాద్ సహా ఐఎంఎస్సీ అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: Shashi Tharoor: కమల్ హాసన్ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్ నేత… భారతీయుడు ఏం హామీ ఇచ్చాడంటే..?

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?