వారెంట్ లేకుండానే సెర్చ్, యూపీలో ఇక స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ !

ఎలాంటి  వారెంట్ లేకుండానే సెర్చ్ చేయడానికి అధికారాలు కలిగిన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్టంలోని సివిల్ కోర్టుల్లో..

వారెంట్ లేకుండానే సెర్చ్, యూపీలో ఇక  స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 14, 2020 | 12:18 PM

ఎలాంటి  వారెంట్ లేకుండానే సెర్చ్ చేయడానికి అధికారాలు కలిగిన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్టంలోని సివిల్ కోర్టుల్లో ఎలాంటి భద్రత లేకపోవడంపై అలహాబాద్ హైకోర్టు గత ఏడాది డిసెంబరులో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫోర్స్ సభ్యులు మేజిస్ట్రేట్ ఉత్తర్వులు గానీ, వారెంట్ గానీ లేకుండానే ఎవరినైనా అరెస్టు చేయవచ్ఛు. మొదటి దశలో అయిదు బెటాలియన్లను నియమిస్తారని, ఆ తరువాత ఈ సంఖ్య పెరగవచ్చునని రాష్ట్ర హోమ్ శాఖ వర్గాలు తెలిపాయి. మొదటి దశకు రూ. 1747 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో నేరాల సంఖ్యను తగ్గించడానికి కూడా ఈ చర్య దోహదపడుతుందని భావిస్తున్నారు.

Latest Articles
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం