ఎమ్మెల్యే వినూత్న ఆఫర్: చైనా యాప్‌లు డిలీట్ చేస్తే మాస్కులు ఫ్రీ.. 

భద్రతకు పెద్దపీట వేస్తూ ఇటీవల భారత ప్రభుత్వం చైనాకి చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించిన సంగతి విదితమే. ఈ క్రమంలో చైనా యాప్‌లను తొలగించాలంటూ ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనుపమ జైస్వాల్ వినూత్న ప్రచారం చేపట్టారు. మొబైల్స్‌లో నుంచి చైనా యాప్‌లను డిలీట్ చేసిన వారికి మాస్కులు ఉచితంగా ఇస్తామని ఆమె ప్రకటించారు. భారత సార్వభౌత్వానికి, సమగ్రతకు ముప్పుగా ఉన్న చైనాకి చెందిన యాప్‌లను నిషేధించినందున.. ప్రజలు వాటిని తమ మొబైల్స్ […]

ఎమ్మెల్యే వినూత్న ఆఫర్: చైనా యాప్‌లు డిలీట్ చేస్తే మాస్కులు ఫ్రీ.. 

Edited By:

Updated on: Jul 02, 2020 | 10:09 PM

భద్రతకు పెద్దపీట వేస్తూ ఇటీవల భారత ప్రభుత్వం చైనాకి చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించిన సంగతి విదితమే. ఈ క్రమంలో చైనా యాప్‌లను తొలగించాలంటూ ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనుపమ జైస్వాల్ వినూత్న ప్రచారం చేపట్టారు. మొబైల్స్‌లో నుంచి చైనా యాప్‌లను డిలీట్ చేసిన వారికి మాస్కులు ఉచితంగా ఇస్తామని ఆమె ప్రకటించారు.

భారత సార్వభౌత్వానికి, సమగ్రతకు ముప్పుగా ఉన్న చైనాకి చెందిన యాప్‌లను నిషేధించినందున.. ప్రజలు వాటిని తమ మొబైల్స్ నుంచి తొలగించేలా ప్రోత్సహించేందుకు ఉచితంగా మాస్కులను ఆఫర్ చేస్తున్నాం.. అని అనుపమ పేర్కొన్నారు. స్థానిక బీజేపీ మహిళా మోర్చా విభాగం సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో అనుపమ ప్రాథమిక విద్యా మంత్రిగా పనిచేశారు. అయితే గతేడాది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆమె కేబినెట్ పదవికి దూరమయ్యారు.

Also Read: అసోంలో వరద బీభత్సం.. 33కు పెరిగిన మృతుల సంఖ్య..