అసోంలో వరద బీభత్సం.. 33కు పెరిగిన మృతుల సంఖ్య..

అసోంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల వెల్లువెత్తిన వరదల కారణంగా మరో ఆరుగురు మరణించారు. బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్, నల్బరీ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు వరదల్లో

  • Tv9 Telugu
  • Publish Date - 9:29 pm, Thu, 2 July 20

Six more die in Assam floods: అసోంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల వెల్లువెత్తిన వరదల కారణంగా మరో ఆరుగురు మరణించారు. బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్, నల్బరీ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు వరదల్లో మృత్యవాత పడ్డారు. దీంతో అసోం వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 33కు పెరిగింది. 33 జిల్లాలుండగా 21 జిల్లాల్లో 1.5 మిలియన్ల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. 2,197 గ్రామాలు వరదనీటిలో మునిగాయి. దీంతో 15వేలమంది వరద బాధితులను 254 సహాయ శిబిరాలకు తరలించారు.

బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. 4,200 మందిని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 87,000 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు.కజిరంగా జాతీయ పార్కు వరదనీటిలో మునిగిపోవడంతో 18 వన్యప్రాణులు మరణించాయి. ఏడు జింకలు, రెండు అడవి దున్నలు నీటమునిగి మరణించాయి.