అన్‌లాక్‌ 4.0.. అనుమతించేవి, అనుమతించనివి ఇవే..

అన్‌లాక్‌ 3.0 మరో రెండు రోజుల్లో ముగియనుండగా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్‌ 4.0 గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. ఇక సెప్టెంబర్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో పూర్తి స్థాయి లాక్ డౌన్ కొనసాగుతుందని..

అన్‌లాక్‌ 4.0.. అనుమతించేవి, అనుమతించనివి ఇవే..
Ravi Kiran

|

Aug 30, 2020 | 1:05 AM

Unlock 4.0 Guidelines: అన్‌లాక్‌ 3.0 మరో రెండు రోజుల్లో ముగియనుండగా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్‌ 4.0 గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. ఇక సెప్టెంబర్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో పూర్తి స్థాయి లాక్ డౌన్ కొనసాగుతుందని.. కంటైన్మెంట్ జోన్ల వెలుపల మాత్రం మరిన్ని సడలింపులు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, అన్‌లాక్‌ 4.0లో అనుమతించేవి, అనుమతించనివి ఇలా ఉన్నాయి.

అన్‌లాక్‌ 4.0 రూల్స్..

 • సెప్టెంబర్ 7 నుంచి దశలవారీగా మెట్రో సర్వీసులు ప్రారంభం..
 • సెప్టెంబర్ 21 నుంచి 100 మందితో క్రీడలు, సభలకు అనుమతి..
 • సెప్టెంబర్ 30 వరకు విద్యాసంస్థలు, మాల్స్ బంద్
 • సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌పై నిషేధం..
 • అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగింపు
 • రాష్ట్రాలు సొంతంగా లాక్ డౌన్ విధించకూడదు
 • కంటైన్మెంట్ జోన్లలో సెప్టెంబర్ 30 వరకు లాక్ డౌన్..
 • నైపుణ్య శిక్షణ కేంద్రాలు, పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు తెరుచేందుకు అనుమతి..
 • ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనా కోర్సులు, సాంకేతిక, వృత్తి సంబంధ కోర్సులకు అనుమతి
 • సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి
 • 50 శాతం బోధనా సిబ్బంది స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు (ఆన్‌లైన్ క్లాసుల కోసం) అనుమతి
 • అంతర్రాష్ట్ర ప్రయాణాలపై పూర్తిగా ఆంక్షలు తొలగింపు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu