ప్యాకేజీపై కేంద్ర ఆర్ధిక మంత్రి వివరణ

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 7:45 PM

న్యూఢిల్లీ: టీడీపీ పార్టీ ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేసిన నేపథ్యంలో ఏపీలో ప్రత్యేక హోదా గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి పియూష్ గోయల్ సమాధానమిచ్చారు. హోదాకు ప్రత్యామ్నాయంగా 2016 అక్టోబర్‌లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని సీఎం చంద్రబాబు స్వాగతించారని చెప్పారు. అయితే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని ఆ ప్యాకేజీలో మార్పులు చేశామని, 2017లో […]

ప్యాకేజీపై కేంద్ర ఆర్ధిక మంత్రి వివరణ
Follow us on

న్యూఢిల్లీ: టీడీపీ పార్టీ ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేసిన నేపథ్యంలో ఏపీలో ప్రత్యేక హోదా గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి పియూష్ గోయల్ సమాధానమిచ్చారు. హోదాకు ప్రత్యామ్నాయంగా 2016 అక్టోబర్‌లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని సీఎం చంద్రబాబు స్వాగతించారని చెప్పారు.

అయితే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని ఆ ప్యాకేజీలో మార్పులు చేశామని, 2017లో కేబినెట్ ఆమోదం కూడా తెలిపిందని అన్నారు. ఏపీ కోరిన మార్పులను చెబుతూ ప్యాకేజీ ప్రకారమే కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90:10 రేషియోలో నిధులు విడుదల చేస్తున్నామని అన్నారు. 2017 మేలో ఆర్ధిక మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు లేఖ రాసినట్టు చెప్పారు పియూష్ గోయల్.