వర్షం నీటిని ఇలా చేయవచ్చు..

జోరుగా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరం ముప్పు తిప్పలు పడుతోంది. అయితే ఆ వర్షం నీరు వాడకంపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు ఓ లేఖ రాశారు. ముంబైలో వరద నీటిని ఇరిగేషన్‌, నగరం చుట్టుపక్కల...

  • Sanjay Kasula
  • Publish Date - 7:08 am, Thu, 15 October 20
వర్షం నీటిని ఇలా చేయవచ్చు..

జోరుగా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరం ముప్పు తిప్పలు పడుతోంది. అయితే ఆ వర్షం నీరు వాడకంపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు ఓ లేఖ రాశారు. ముంబైలో వరద నీటిని ఇరిగేషన్‌, నగరం చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు సరఫరా చేయడంతో పాటు నాసిక్‌, అహ్మద్‌నగర్‌లలో హార్టికల్చర్‌ కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు జలాలను కరవు పీడిత ప్రాంతాలకు తరలించి నీటి కొరతను అధిగమించని సూచించారు.

ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికతో పనిచేస్తే వరద నీరు ముంబై నగరం పక్కనే ఉన్న ఠానేకు తరలించవచ్చన్నారు. ఆ నీటిని డ్యాంలో నిల్వచేయవచ్చని సూచించారు. అలా నిల్వ చేసిన నీటిని ఇరిగేషన్‌, పరిశ్రమలు, హార్టికల్చర్‌ కోసం వాడుకోవచ్చని అన్నారు. ఈ చర్యలు మిథి నదిలో కొన్నేళ్ల పాటు నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపుతుందని అన్నారు.

అలాగే, నగరంలోని అన్ని రహదారులను సిమెంట్‌ కాంక్రీట్‌ రహదారులుగా మార్చే ప్రాజెక్టును చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తారు రోడ్డులు భారీ వర్షాలకు నిలబడవన్నారు. వరదలు, డ్రైనేజీ సమస్యలను ఎదుర్కోవాలంటే సమగ్రమైన ప్రణాళిక అవసరమని తెలిపారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను ఓ అంతర్జాతీయ కన్సల్టెంట్‌కు సమర్పించాలన్నారు. వరదలు వచ్చినప్పుడు పునరావృతమవుతున్న సంక్షోభాన్ని అధిగమించేందుకు వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుపై డీపీఆర్‌ సిద్ధం చేశామన్నారు మంత్రి.