ప్రియాంక గాంధీకి షాక్ ఇచ్చిన కేంద్రం..

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆమె నివాసముంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ప్రియాంక లోధి ఎస్టేట్‌లోని టైప్ 6బీలోని 35వ నెంబర్ బంగ్లాను అధికారికంగా వినియోగించుకుంటున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 7:17 pm, Wed, 1 July 20
ప్రియాంక గాంధీకి షాక్ ఇచ్చిన కేంద్రం..

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. మాజీ ప్రధాని కూతురు హోదా కల్పించిన సదుపాయాలను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఆమె నివాసముంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ప్రియాంక లోధి ఎస్టేట్‌లోని టైప్ 6బీలోని 35వ నెంబర్ బంగ్లాను అధికారికంగా వినియోగించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితమే జెడ్ ఫ్లస్ సెక్యూరిటీతో కూడిన ఎస్పీజీ ప్రొటెక్షన్ ఫోర్స్ ను వెనక్కి తీసుకున్న కేంద్రం.. తాజాగా ప్రభుత్వ బంగ్లాను కూడా వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఆగస్టు 1 నాటికి బంగ్లా ఖాళీ చేయాలని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పటి వరకు బంగ్లాకు రాయితీతో కూడిన అద్దె ఉంటుందని తెలిపింది. ఎస్పీజీ ప్రొటెక్షన్ కలిగిన వ్యక్తుల మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఈ బంగ్లా సదుపాయాన్ని కల్పిస్తుంది.