కంకిపాడులో విషాదం, కాలువలో గల్లంతైన ఇద్దరు చిన్నారులు, ఐదు గంటలుగా కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్
కృష్ణాజిల్లా కంకిపాడులో విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారులు కాలువలో గల్లంతయ్యారు. ఇంటి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ..
కృష్ణాజిల్లా కంకిపాడులో విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారులు కాలువలో గల్లంతయ్యారు. ఇంటి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ పక్కనున్న కాల్వలో పడిపోయినట్టు చెబుతున్నారు. ఐదు గంటలుగా కాలువలో గాలిస్తున్నప్పటికీ, రాత్రి 9.45 వరకూ చిన్నారుల ఆచూకీ లభ్యం కాలేదు. బాధిత బాలురు జస్వంత్, దిలీప్ కృష్ణ ఆచూకీ కోసం పోలీసులతోపాటు, SDRF సిబ్బంది కూడా సెర్చ్ ఆపరేషన్ లో పాలుపంచుకుంటున్నారు. ఫ్లడ్ లైట్లతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. మరోవైపు, చిన్నారుల ఆచూకీ కోసం బాలుర తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారిపోయింది.