Pushpa Movie Update: పాన్ ఇండియా లెవల్లో ‘పుష్ప’ ? బన్నీ ప్లాన్ మాములుగా లేదుగా..
టాలీవుడ్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'పుష్ప'. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో
టాలీవుడ్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. ఇక ఇందులో హీరోయిన్ రష్మిక మందన గ్రామీణ యువతిగా కనిపించనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యం శెట్టి మీడియా బ్యానర్లపై నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమాను తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తామని ప్రకటించింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మొతం పది భాషల్లో విడుదల చేయనున్నరట. ఇందుకు కారణం లేకపోలేదు. గతేడాది బన్నీ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా ఏ రెంజ్లో హిట్ అయ్యిందో తెలిసిన సంగతే. అయితే ఆ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోందట. ఇప్పటికే తెలుగులో రామ్ నటించిన ‘రెడ్’ మూవీని 8 భాషల్లో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్నాయి.