కాంగ్రెస్ పార్టీలో నాయ‌క‌త్వ సంక్షోభం

దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్​ పార్టీ ప్రస్తుతం నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు పార్టీలో సమూల మార్పులు చేయాలని కోరుతూ 23 మంది నేతలు అధినాయకత్వానికి రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో నాయ‌క‌త్వ సంక్షోభం
Follow us

|

Updated on: Aug 25, 2020 | 4:40 PM

దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్​ పార్టీ ప్రస్తుతం నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు పార్టీలో సమూల మార్పులు చేయాలని కోరుతూ 23 మంది నేతలు అధినాయకత్వానికి రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇవాళ జరిగిన CWC సమావేశంలో వాడివేడిగా చర్చ సాగింది. BJP కుట్ర ఉందన్న చర్చ జరిగినట్టు పార్టీ వర్గాలంటున్నాయి. అయితే ఇదంతా ప్రచారమేనని.. లేఖ రాసిన సమయాన్ని మాత్రమే గాంధీలు ప్రశ్నించారంటున్నారు. రాహుల్‌ తమను నిలదీసినట్టు వచ్చిన వార్తలు వాస్తవం కాదంటున్నారు గులాంనబీ ఆజాద్‌. అటు లేఖపై సీరియస్‌గా ఉన్న తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే సీనియర్లు మళ్లీ ఆమె ఉండాలని పట్టుబట్టడంతో వెనక్కు తగ్గారు. తాత్కాలికంగా పార్టీ పగ్గాలు చేపట్డానికి అంగీకరించారు సోనియా.

కాంగ్రెస్ లో సమూల ప్రక్షాళన చేయడంతో పాటు.. యాక్లీవ్‌గా ఉండే ఎఫెక్టివ్‌ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలంటూ సోనియాకు లేఖ రాశారు 23 మంది సీనియర్లు. ఆగస్టు 7న ఈ లేఖ పంపినట్టు తెలుస్తోంది. ఈ లేఖలోని అంశాలు లీకు కావడంతో కాంగ్రెస్‌లో దుమారం రేపింది. 7 పేజీల లెటర్‌లో పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు, ఎఫెక్టివ్‌ నాయకత్వం, క్షేత్రస్థాయిలో యాక్టివ్‌గా ఉండే నాయకత్వాలు, రోజువారీ నిర్ణయాలకు పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు, CWCలో నియామకం కాకుండా ఎన్నికల నిర్వహణ వంటి అంశాలు సూచిస్తూ ఈ లేఖ రాశారు.

లేఖ అందిన వెంటనే సీరియస్‌ అయిన సోనియా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సన్నిహితుల వద్ద చెబుతూ వచ్చారు. ఇదే విషయాన్ని ఇవాళ జరిగిన CWCలోనూ చెప్పారు. అయితే సమావేశంలో మాత్రం సీనియర్లు రాసిన లేఖపైనే వాడీవేడిగా చర్చ సాగినట్టు తెలుస్తోంది. సోనియా ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో ఉన్న సమయంలో లేఖ రాయడాన్ని రాహుల్‌, ప్రియాంక తప్పుబట్టినట్టు చెబుతున్నారు. పైగా రాజస్తాన్‌ సంక్షోభం ఉన్న సమయంలో రాయడం వెనక బీజేపీ కుట్ర కోణంపైనా అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే 30 ఏళ్లుగా బీజేపీకి ఎలాంటి అనుకూల ప్రకటన చేయని తమను నిందించడం ఏంటని కపిల్‌ సిబల్‌ ట్వీట్ మరింత ఆసక్తిగా మారింది. నిరూపిస్తే పార్టీకి రాజీనామా చేస్తానని గులాంనబీ ఆజాద్‌ కూడా CWCలో అన్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత తన పదవికి రాజీనామా చేయడంతో అనివార్య పరిస్థితుల్లో సోనియా తాత్కాలిక అధ్యక్ష పదవి చేపట్టారు. కానీ ఏడాది గడిచినా కొత్త అధ్యక్ష నియామకం జరగకపోవడం.. తాజా లేఖలు కలకలం రేపాయి. అయితే పార్టీని ఇప్పటికీ సోనియా, రాహుల్‌ మాత్రమే నడిపించగలరని నాయకులు విశ్వసిస్తున్నారు. పార్టీలో సంక్షోబాలు కొత్తకాదు.. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇక్కడ ప్రత్యర్ధి బలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. ఎదురులేని పరిస్థితుల నుంమచి ఎదర్కోలేని దుస్థితికి వచ్చింది. పార్టీ నానాటికి దిగజారుతోంది. ఈ స్థితిలో పార్టీ మళ్లీ ఎలా గట్టెక్కుతుందన్నది చూడాల్సి ఉంటుంది. అధ్యక్షులు 1950 నుంచి కాంగ్రెస్‌ పార్టీకి 73 ఏళ్లలో 38 ఏళ్ల పాటు అంటే దాదాపు సగం గాంధీల కుటుంబమే అధ్యక్షులుగా వ్యవహరించింది. అత్యధంగా సోనియానే పదవిలో ఉన్నారు.

పార్టీకి ఎవరు ఎప్పుడు అధ్యక్షులుగా చేశారో ఈ కింద ఇమేజ్‌లో చూడండి…

ప్ర‌స్తుతం తాత్కాలిక‌ అధ్య‌క్షురాలిగా సోనియా గాంధీ కొన‌సాగుతున్నారు

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!