నా 13 ఏళ్ల కృషి ‘అర్జున’…

 'అర్జున అవార్డు'కు ఎంపికవ్వడంపై టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయస్థాయిలో తన 13 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతి ఫలం అర్జున అవార్డు అని అభివర్ణించారు. ఈ అవార్డు పట్ల తనకంటే...

నా 13 ఏళ్ల కృషి 'అర్జున'...
Sanjay Kasula

|

Aug 25, 2020 | 4:44 PM

‘అర్జున అవార్డు’కు ఎంపికవ్వడంపై టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయస్థాయిలో తన 13 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతి ఫలం అర్జున అవార్డు అని అభివర్ణించారు. ఈ అవార్డు పట్ల తనకంటే కూడా కుటుంబం, ముఖ్యంగా భార్య ప్రతిమా సింగ్‌ ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని ఇషాంత్‌ పేర్కొన్నారు. అర్జున అవార్డుపై ఇషాంత్ రియాక్షన్‌ వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ చేసింది.

అర్జున అవార్డు నన్ను వరించిందని తెలిసిన క్షణం నుంచి చాలా ఆనందంగా ఉంది. గర్వంగా కూడా ఫీలయ్యాను. గత 13 ఏళ్లుగా ఎంతో హార్డ్ వర్క్ చేశాను. అందువల్ల నాతో పాటు నా కుటుంబం గర్విస్తోంది. నిజానికి నాకంటే నా భార్య ప్రతిమ ఎక్కువ ఆనందించింది. ఎందుకంటే నాకు అవార్డు రావాలని ఆమె ఎప్పట్నించో కోరుకుంటోంది. అని ఇషాంత్ చెప్పుకొచ్చారు.

2007లో భారత తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఇషాంత్‌… ఇప్పటివరకు 97 టెస్టులు , 80 వన్డేలు, 14 టీ20లు ఆడారు. వచ్చే శనివారం అంటే ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఆన్‌లైన్‌ వేదికగా జరిగే కార్యక్రమంలో ఇషాంత్ ఈ అవార్డును స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 (IPL) కోసం దుబాయ్‌లో ఉన్న ఇషాంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్నారు. క్యాష్ రిచ్ లీగ్‌లో సత్తాచాటి పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu