విశాఖ తీరం.. రాజకీయ మేఘం…బిగ్ న్యూస్..బిగ్ డిబేట్…

విశాఖ తీరం.. రాజకీయ మేఘం...బిగ్ న్యూస్..బిగ్ డిబేట్...

విశాఖ గ్యాస్ బాధితులను ఆదుకునేందుకు ఏపీ స‌ర్కార్ శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు వేగంగా తీసుకుంటున్నారు. బాధితులకు పరిహారం చెల్లించేందుకు సీఎం సహాయనిధి నుండి శుక్రవారం 30 కోట్లు మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొకరికి కోటి రూపాయలు, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి పదేసి లక్షలు, రెండు, మూడు రోజులు హాస్పిటల్‌లో ఉన్నవారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం అందించేందుకు సీఎం జగన్ ఆదేశించిన […]

Ram Naramaneni

|

May 08, 2020 | 11:07 PM

విశాఖ గ్యాస్ బాధితులను ఆదుకునేందుకు ఏపీ స‌ర్కార్ శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు వేగంగా తీసుకుంటున్నారు. బాధితులకు పరిహారం చెల్లించేందుకు సీఎం సహాయనిధి నుండి శుక్రవారం 30 కోట్లు మంజూరు చేశారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొకరికి కోటి రూపాయలు, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి పదేసి లక్షలు, రెండు, మూడు రోజులు హాస్పిటల్‌లో ఉన్నవారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం అందించేందుకు సీఎం జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. సాధారణ చికిత్స పొందుతున్న వారికి 25 వేల రూపాయలు, బాధిత గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయంగా 10 వేల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు విడుదల చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్‌కు మొత్తం డబ్బులు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ముఖ్యమంత్రి జగన్ మాట ఇచ్చిన 24 గంటల్లోనే పరిహారం చెల్లింపునకు ఆదేశాలు జారీ చేశారు. అయితే పరిహారం విషయంలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ మ‌ధ్య మాట‌ల‌యుద్దం కొన‌సాగుతుంది. బాధితుల ప‌క్షాన నిల‌బ‌డ‌కుండా..కంపెనీల త‌రుఫున సీఎం మాట్లాడుతున్నార‌ని..తూతూ మంత్రంగా కంపెనీపై కేసుల పెడితే ఉప‌యోగం ఉండ‌ద‌న్నారు. దీనిపై బీజేపీ వెర్ష‌న్ వెరేలా ఉంది. బాధితుల‌కు ప్ర‌భుత్వం ఇచ్చిన‌ ప‌రిహారం బాగుందంటూనే…ఘ‌ట‌న‌పై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ చేయించాలిన కోరింది. ప్ర‌భుత్వం హైప‌వ‌ర్ క‌మిటీని ఏర్పాటు చేసి..ఆ నివేదిక ఆధారంగా భవిష్య‌త్ లో మ‌ళ్లీ ఇలాంటి ఘ‌ట‌న‌లు రిపీట్ కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్తోంది. ఇన్నాళ్లు ఏపీలో రాజ‌కీయ‌ప‌క్షాల మ‌ధ్య‌ క‌రోనాపై మాట‌ల యుద్దం జ‌రిగింది. ఇప్పుడు విశాఖ గ్యాస్ లీక్ వేదిక‌గా రాజకీయ ముద్దానికి దిగారు. ఇదే అంశంపై ఇవాల్టీ బిగ్ న్యూస్-బిగ్ డిబేట్.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu