Tsunami warning sirens ring out: అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం కేంద్రం అలాస్కాలోని చిగ్నిక్ నుండి 75 మైళ్ళ దూరంలో ఉంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. దీంతో సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికా జియాలాజికల్ సర్వే హెచ్చరికలు జారీ చేసింది. ఆంకరేజ్‌కు నైరుతి దిశగా 500 మైళ్లు, పెర్రివిల్లేకు దక్షిణ, ఆగ్నేయ దిశగా 60 మైళ్ల దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది.
పసిఫిక్ సునామి హెచ్చరిక కేంద్రం.. భూకంప కేంద్రం నుండి 300 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు సునామీ హెచ్చరికను జారీచేసింది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తమయ్యారు. భూకంపంలో సంభవించిన ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: నేటి నుంచి సంతలు బంద్.. రూల్స్ అతిక్రమిస్తే జరిమానా, కేసులు నమోదు..
[svt-event date=”22/07/2020,3:42PM” class=”svt-cd-green” ]
This is our updated info for the M7.8 Simeonof EQ that occured on July 21, 2020 at 10:12 pm AKDT. Find current aftershock info, tectonic setting, etc. at https://t.co/H901D4FNoe. This page will be updated as we learn more. #SimeonofEQ #alaska #earthquake pic.twitter.com/avHxqc7951
— Alaska Earthquake Center (@AKearthquake) July 22, 2020