AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లాష్ న్యూస్: కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడం కుదరదు..!

ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ జేఏసీ ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓ వైపు పోరాటం అంటూనే.. మరోవైపు విధుల్లో చేరతామంటున్నారు. తమ ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై, ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరడం దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా లేదు. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే విధులకు గైర్హాజరై, చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప, ఆర్టీసీ యాజమాన్యం గానీ, […]

ఫ్లాష్ న్యూస్: కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడం కుదరదు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 25, 2019 | 8:42 PM

Share

ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ జేఏసీ ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓ వైపు పోరాటం అంటూనే.. మరోవైపు విధుల్లో చేరతామంటున్నారు. తమ ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై, ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరడం దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా లేదు. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే విధులకు గైర్హాజరై, చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప, ఆర్టీసీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ సమ్మె చేయమని చెప్పలేదు.

బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతి ముఖ్యమైన పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారు. ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరయ్యి, మళ్లీ ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదు. గౌరవ హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మిక శాఖ కమిషనర్ తగు నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుంది. అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుంది. అప్పటి వరకు అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు సునీల్ శర్మ.

హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని.. తమంతట తాముగా సమ్మెకు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదన్నారు. కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారు. ఇక ముందు కూడా యూనియన్ల మాట విని మరిన్ని నష్టాలు కోరి తెచ్చుకోవద్దని.. రేపు డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని, బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డగించవద్దని కోరుతున్నాను. అన్ని డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షించడం జరుగుతుందన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వంగానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ క్షమించదు. చట్ట పరమైన చర్యలు, క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని సునీల్ శర్మ స్పష్టం చేశారు.

Follow Us
ట్రైన్‌లో ఇవేం పనులు సామీ.. కొత్త జంట చేసిన పనికి అంతా అవాక్కు..
ట్రైన్‌లో ఇవేం పనులు సామీ.. కొత్త జంట చేసిన పనికి అంతా అవాక్కు..
వార్నీ ఇదేం ఊరు సామీ,పొదామంటే దారేలేదు..ఇళ్ల కప్పులే నడిచే రోడ్లు
వార్నీ ఇదేం ఊరు సామీ,పొదామంటే దారేలేదు..ఇళ్ల కప్పులే నడిచే రోడ్లు
తెలంగాణలో 1,500 ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే..
తెలంగాణలో 1,500 ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే..
స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్.. ఇప్పటికీ అదే క్రేజ్..
స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్.. ఇప్పటికీ అదే క్రేజ్..
ఇది నా అడ్డా.. ఇక్కడి నుంచి కదిలేది లేదు.. నడిరోడ్డుపై చుక్కలు..
ఇది నా అడ్డా.. ఇక్కడి నుంచి కదిలేది లేదు.. నడిరోడ్డుపై చుక్కలు..
స్కూల్ హాస్టల్‌లోకి చొరబడిన కట్లపాము,నిద్రలోనే కాటు వేసిన కాలనాగు
స్కూల్ హాస్టల్‌లోకి చొరబడిన కట్లపాము,నిద్రలోనే కాటు వేసిన కాలనాగు
భారత్ తొలి మ్యాన్ మిషన్‌కు కౌంట్‌డౌన్.. గగన్‌యాన్ టెస్ట్‌లో ఇస్రో
భారత్ తొలి మ్యాన్ మిషన్‌కు కౌంట్‌డౌన్.. గగన్‌యాన్ టెస్ట్‌లో ఇస్రో
భారత్–ఆస్ట్రేలియా సమావేశం.. దేశ భద్రతకు మరింత బలం!
భారత్–ఆస్ట్రేలియా సమావేశం.. దేశ భద్రతకు మరింత బలం!
కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న సెకండాఫ్ క్యాలెండర్‌..!
కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న సెకండాఫ్ క్యాలెండర్‌..!
గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..
గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..