AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించగలరా..

ఆన్‌లైన్‌లో డిగ్రీ,పీజీ పరీక్షలు నిర్వహించలేరా అని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.

ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించగలరా..
Sanjay Kasula
|

Updated on: Sep 10, 2020 | 3:43 PM

Share

ఆన్‌లైన్‌లో డిగ్రీ,పీజీ పరీక్షలు నిర్వహించలేరా అని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. కోవిడ్  వైరస్ వ్యాప్తి‌ కారణంగా హాస్టల్స్‌ మూసి ఉన్నందున పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడతారని, చివరి సెమిస్టర్ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

పిటిషనర్‌ వాదనపై స్పందించిన న్యాయస్థానం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించగలరా అంటూ  ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సాంకేతికతను ఉపయోగించుకుని ఇంజనీరింగ్ కోర్సులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. అలాగే సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్‌గా పరిగణిస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయస్థానం ప్రశ్నలకు స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌.. ప్రభుత్వాన్ని అడిగి చెప్తానని కోర్టుకు విన్నవించారు. దీంతో విచారణ ఈనెల 15కు వాయిదా వేసింది.

మరోవైపు కరోనా లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన వివిధ డిగ్రీ కోర్సుల చివరి సంవత్సరం  పరీక్షల నిర్వహణకు ఉస్మానియా వర్సిటీ రెడీ అవుతోంది. ఈనెల 22 నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు మొదలవుతాయి. అదేవిధంగా ఈనెల 15 నుంచి ఇంజనీరింగ్‌, బీసీఏ, బీఈడీ, బీఫార్మసీ, డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు నిర్వహించేందుకు స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..
ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. నెలనెలా రూ.6,500
ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. నెలనెలా రూ.6,500