AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: షేపెంట్స్ లేరు.. సైరన్ వేసుకుని స్పీడ్‌‌గా వెళ్తున్న అంబులెన్స్.. ఆపి చెక్ చేస్తే షాక్!

ప్రాణాలు కాపాడాల్సిన అత్యవసర వాహనమైన అంబులెన్స్ స్టీరింగ్, ఒక తాగుబోతు చేతికి చిక్కింది. మద్యం మత్తులో మైకం కమ్మేసినా బాధ్యతారహితంగా అంబులెన్స్‌ను రోడ్డుపైకి తీసుకొచ్చిన ఓ డ్రైవర్ రాయదుర్గం పోలీసుల తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి ఆల్ సబా హోటల్ సమీపంలో పోలీసులు బుధవారం (జూలై 29) రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను చేపట్టారు.

Hyderabad: షేపెంట్స్ లేరు.. సైరన్ వేసుకుని స్పీడ్‌‌గా వెళ్తున్న అంబులెన్స్.. ఆపి చెక్ చేస్తే షాక్!
Ambulance
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jul 30, 2026 | 1:38 PM

Share

ప్రాణాలు కాపాడాల్సిన అత్యవసర వాహనమైన అంబులెన్స్ స్టీరింగ్, ఒక తాగుబోతు చేతికి చిక్కింది. మద్యం మత్తులో మైకం కమ్మేసినా బాధ్యతారహితంగా అంబులెన్స్‌ను రోడ్డుపైకి తీసుకొచ్చిన ఓ డ్రైవర్ రాయదుర్గం పోలీసుల తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి ఆల్ సబా హోటల్ సమీపంలో పోలీసులు బుధవారం (జూలై 29) రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను చేపట్టారు. ఈ క్రమంలో ఆ మార్గంలో వస్తున్న రెడ్ అంబులెన్స్ ను ఆపి డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించారు.

అంబులెన్స్ డ్రైవర్ రాఘవేంద్ర మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ ఏకంగా 324గా నమోదైంది. సాధారణంగా బ్రీత్ ఎనలైజర్‌లో 30 దాటితేనే కేసు నమోదు చేస్తారు. అలాంటిది ఏకంగా 324 రీడింగ్ రావడం చూసి తనిఖీలు చేస్తున్న పోలీసు సిబ్బంది ఒక్కసారిగా విస్తుపోయారు. మద్యం మత్తు ఎంత తీవ్రంగా ఉందో ఈ రీడింగ్ స్పష్టం చేస్తోంది. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ, బాధ్యతను గాలికి వదిలేసి రాఘవేంద్ర వాహనాన్ని రోడ్డుపైకి తీసుకురావడం కలకలం రేపింది.

అత్యవసర సమయంలో రోగులను వేగంగా, సురక్షితంగా ఆసుపత్రికి చేర్చాల్సిన అంబులెన్స్ డ్రైవరే ఇలా తప్పతాగి వాహనం నడపడం పట్ల స్థానికులు, పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో రాఘవేంద్రను అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు, అతడిపై డ్రంకన్ డ్రైవ్ కింద కేసు నమోదు చేశారు. అలాగే సదరు రెడ్ అంబులెన్స్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సేవలందించాల్సిన అంబులెన్స్ డ్రైవర్లు ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
తవ్వకుండానే మీ భూమిలో బంగారు నిధి ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు!
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
ప్రతి భార్య భర్తకు చెప్పని 4 విషయాలు ఇవేనా? ఎందుకు దాస్తారో..
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
600వ టెస్టులో భారత్ జయభేరి.. గాలేలో సుతార్ సూపర్ షో
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..
గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న పూజలు చేస్తే చాలు..