తల్లిదండ్రులారా.. పిల్లలతో ఎప్పుడూ అనకూడని 10 విషయాలు ఏంటో తెలుసా? 

July 30, 2026

Subhash

పిల్లల మానసిక ఎదుగుదలలో తల్లిదండ్రులు మాట్లాడే మాటలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మన నోటి వెంట వచ్చే కొన్ని చిన్న మాటలు లేదా కోపంలో అనే మాటలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. 

 పిల్లల మనస్తత్వం

నీ ఫ్రెండ్‌ని చూడు ఎలా చదువుతున్నాడో, పక్కంటి పిల్లాడిని చూసి నేర్చుకో అని పిల్లలను ఇతరులతో పోల్చకూడదు. వారిలో ఆత్మన్యూనతా భావం పెరగడమే కాకుండా, ఈర్ష్య, ద్వేషం ఏర్పడే అవకాశం ఉంది.

ఇతరులతో పోల్చడం

పిల్లలతో పనులు చేయించడానికో లేక అన్నం తినిపించడానికో దెయ్యం వస్తుంది, పోలీసుకు పట్టిస్తా" అని భయపెట్టకూడదు. ఇది వారి మనస్సులో అనవసరమైన భయాన్ని నింపి, మానసికంగా బలహీనపరుస్తుంది.

ప్రతిదానికీ భయపెట్టడం

ఏదైనా పని సరిగ్గా చేయనప్పుడు నీకు చేతన కాదు, నువ్వు దేనికీ పనికిరావు అనడం చాలా పొరపాటు. ఈ మాటలు పిల్లల్లో నేను ఏదీ చేయలేను అనే ప్రతికూల భావనను పెంపొందిస్తాయి. 

తక్కువ చేయడం

పిల్లలు అల్లరి చేసినప్పుడు నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను లేదా నిన్ను వేరేవాళ్లకు ఇచ్చేస్తాను అని అనకూడదు. ఇది పిల్లల్లో తీవ్రమైన అభద్రతా భావాన్ని, వారిని వదిలేస్తారోననే భయం ఉంటుంది.

బెదిరించడం

పిల్లలు బాధలో ఉన్నప్పుడు ఏడవకూడదు. నువ్వేం చిన్న పిల్లాడివి కావు అని భావోద్వేగాలను అణచివేయడం సరికాదు. వారు తమ భావాలను ఇతరులతో పంచుకోవడం మానేసి, లోలోపలే కుమిలిపోయే ప్రమాదం ఉంది.

భావోద్వేగాలు

నువ్వు పరీక్షల్లో పాస్ అవుతావని నాకు నమ్మకం లేదు అని అపనమ్మకాన్ని వ్యక్తపరచకూడదు. తల్లిదండ్రుల నమ్మకమే పిల్లలకు కొండంత బలం. ఆ నమ్మకమే లేనప్పుడు వారు ప్రయత్నించడం కూడా మానేసే అవకాశం ఉంది.

నిరాశపరచడం

పిల్లల తప్పులను సరిదిద్దేటప్పుడు కోపంతో కాకుండా ఓర్పుతో, ప్రేమగా వివరించాలి. వారి ప్రయత్నాలను మెచ్చుకుంటూ, నీకు తోడుగా ఉన్నాం అనే ధైర్యాన్ని ఇవ్వాలి. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

పెంపకం