AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనిషి ప్రాణం కాపాడిన ‘యాపిల్‘.. కుప్పకూలిన వ్యక్తికి సకాలంలో అందిన వైద్యం!

అమెరికాలో ఓ వ్యక్తి ప్రాణాలను ఆపిల్ వాచ్ కాపాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒహియో రాష్ట్రంలో అనారోగ్యంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కుప్పకూలిపోయాడు. అతను స్పందించలేని పరిస్థితిలో ఉండగానే ఆపిల్ వాచ్ ఆటోమెటిక్‌గా అత్యవసర సేవలకు సమాచారం ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన పారామెడిక్స్ సిబ్బంది అతనికి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

మనిషి ప్రాణం కాపాడిన ‘యాపిల్‘.. కుప్పకూలిన వ్యక్తికి సకాలంలో అందిన వైద్యం!
Smart Watch Saves Man Life
Balaraju Goud
|

Updated on: Jul 30, 2026 | 12:32 PM

Share

అమెరికాలో ఓ వ్యక్తి ప్రాణాలను ఆపిల్ వాచ్ కాపాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒహియో రాష్ట్రంలో అనారోగ్యంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కుప్పకూలిపోయాడు. అతను స్పందించలేని పరిస్థితిలో ఉండగానే ఆపిల్ వాచ్ ఆటోమెటిక్‌గా అత్యవసర సేవలకు సమాచారం ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన పారామెడిక్స్ సిబ్బంది అతనికి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

స్థానిక మీడియా కథనం ప్రకారం, మహమ్మద్ ఇస్లాం అనే వ్యక్తి ఆరోగ్యం బాగోలేక ఆ రోజు పనికి సెలవు తీసుకున్నాడు. ఉదయం నుంచి ఆయాసం, చెవి నొప్పి, నడవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించాయి. చెత్తను బయట పారవేయడానికి ఇంటి బయటకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎంతసేపు స్పృహ తప్పి పడి ఉన్నాడో కూడా అతడికి తెలియదు. కళ్లు తెరిచేసరికి నేలపై పడి ఉండటంతో పాటు తీవ్రంగా చెమటలు పట్టాయి. పైకి లేవడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదని తెలిపాడు.

అయితే కొద్దిసేపటికే సైరన్ శబ్దం వినిపించడంతో ఆశ్చర్యపోయాడు అతడు. తన ఆపిల్ వాచ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ద్వారా అత్యవసర సేవలకు ఆటోమేటిక్‌గా కాల్ చేసినట్లు తెలుసుకున్నాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పారామెడిక్స్ అతడిని ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో అతని ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సకాలంలో చికిత్స అందకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశముందని వైద్యులు తెలిపారు.

ఆపిల్ వాచ్‌లోని ఫాల్ డిటెక్షన్ ఫీచర్ గట్టిగా కిందపడినట్లు గుర్తిస్తే ముందుగా అలర్ట్ ఇస్తుంది. వినియోగదారు స్పందించకపోతే కొంత సమయం తర్వాత ఆటోమెటిక్‌గా అత్యవసర సేవలకు కాల్ చేసి, వినియోగదారు ఉన్న ప్రాంత సమాచారాన్ని కూడా పంపిస్తుంది. ఈ ఘటనతో స్మార్ట్‌వాచ్‌లలోని అత్యవసర భద్రతా ఫీచర్లు అత్యవసర పరిస్థితుల్లో ఎంత ఉపయోగకరంగా ఉంటాయో మరోసారి రుజువైంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us